హార్స్ రైడ్ లో ప్రమాదం.. మహిళకు అంగవైకల్యం..BD3,000 పరిహారం..!!

- February 07, 2025 , by Maagulf
హార్స్ రైడ్ లో ప్రమాదం.. మహిళకు అంగవైకల్యం..BD3,000 పరిహారం..!!

మనామా: ఓ బహ్రెయిన్ యువతి హార్స్ రైడ్ చేస్తున్న సమయంలో మరో హార్స్ దాడి చేయడంతో  5% శాశ్వత వైకల్యానికి గురైంది. ఈ సంఘటనపై హార్స్ రైడ్ నిర్వహక యజమానిపై చట్టపరమైన చర్యలకు దిగారు. దీనిపై ఇటీవలి కోర్టు తీర్పు ఇచ్చింది. గాయపడ్డ మహిళకు 3,000 బహ్రెయిన్ దినార్లు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. మహిళ లాయర్ అల్ ఖైద్ ప్రకారం,  సాక్షుల వాంగ్మూలం ఆధారంగా కోర్టు తీర్పునిచ్చింది. నిర్వాహకుల పొరబాటు కారణంగానే ప్రమాదం జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. భౌతిక నష్టానికి 2,500 బహ్రెయిన్ దినార్లు, నైతిక నష్టాలకు 500 దినార్లను నష్టపరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com