హాఫ్ డెసర్ట్..గంటకు Dh300కి పెరిగిన క్యాంపింగ్ ఫీజు..!!
- February 09, 2025
దుబాయ్: అల్ ఐన్ రోడ్, ఎమిరేట్స్ రోడ్ సర్కిల్లో ఉన్న హాఫ్ డెసర్ట్, ప్రశాంతమైన ఎడారి బార్బెక్యూను ఆస్వాదించాలనుకునే నివాసితులకు చాలా కాలంగా ఇష్టమైన శీతాకాల విహారయాత్రగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలో వందలాది టెంట్లు ఏర్పాటవుతాయి. సందర్శకులు విశ్రాంతి తీసుకోవడానికి, వంట చేయడానికి, ఓపెన్ ఆకాశం కింద చల్లటి సాయంత్రాన్ని ఆస్వాదించేందుకు ఇది ప్రసిద్ధి చెందింది. అయితే, ఈ సీజన్లో అద్దె ధరలు గణనీయంగా పెరిగాయి. ఇది చాలా మంది సందర్శకులను ఆశ్చర్యపరిచింది, అదే సమయలో నిరాశపరిచింది.
ఇరానియన్ ప్రవాసియైన జావాద్ జాఫారి గత డిసెంబర్లో మ్యూజిక్ సిస్టమ్, గ్రిల్ తో కూడిన సెటప్ కోసం గంటకు Dh100 మాత్రమే చెల్లించినట్లు తెలిపారు. ఇప్పుడు పెరిగిన ధరలను చూసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు. "నేను అదే టెంట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ధర గంటకు Dh300కి పెరిగిందని విని షాక్ అయ్యాను." అని వివరించాడు. సైట్లోని టెంట్ల ధరల పెరుగుదలకు పెరుగుతున్న డిమాండ్ కారణమని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో అనేక టెంట్లను నిర్వహించే అబ్దుల్ రహీమ్ అక్తర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ధర మొదట గంటకు Dh300గా నిర్ణయించామన్నారు. అయితే, అక్టోబర్ నవంబర్లలో తక్కువ మంది సందర్శకులు వస్తారని, ఆసమయంలో డిస్కౌంట్లను అందించామని అక్తర్ అన్నారు. అయితే, జనవరిలో శీతాకాలం సమయంలో అధిక డిమాండ్ ఉంటుందని తెలిపాడు.ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, చాలా మంది నివాసితులు హాఫ్ డెసర్ట్ అందించే ప్రత్యేకమైన అనుభవం కోసం తరలివస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







