సౌదీలో మైనస్ 2 డిగ్రీల సెల్సియస్‌తో తురైఫ్ రికార్డు..!!
- February 10, 2025
తురైఫ్: ఉత్తర సరిహద్దు ప్రాంతంలోని తురైఫ్ గవర్నరేట్ సౌదీ అరేబియాలో సున్నా కంటే తక్కువ రెండు డిగ్రీల సెల్సియస్ వద్ద అత్యల్ప ఉష్ణోగ్రతను నమోదు చేసింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వెల్లడించింది. కింగ్‌డమ్‌లోని చాలా ప్రాంతాలలో చల్లటి వాతావరణం కొనసాగుతుందని, కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటాయని, దేశంలోని ఉత్తర ప్రాంతాలలో మంచు కురిసే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. ఈ చల్లని వాతావరణాన్ని ఎదుర్కోవటానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరింది. తూర్పు ప్రావిన్స్‌లోని దక్షిణ ప్రాంతాలలో తెల్లవారుజామున పొగమంచు కారణంగా లో విజిబిలిటీ ఉంటుందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం అలెర్ట్ జారీ చేసింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







