50 ఏరియాల్లో ట్రాఫిక్ అప్‌గ్రేడ్..ఈ మార్గాల్లో 60% తగ్గిన ట్రావెల్ టైమ్..!!
- February 10, 2025
యూఏఈ: దుబాయ్ 2024లో ఎమిరేట్‌లోని 50 ప్రదేశాలలో ట్రాఫిక్ అప్గ్రేడ్లను పూర్తిచేసింది. ఈ చొరవ ప్రయాణ సమయాన్ని 10 నిమిషాల నుండి కేవలం 4 నిమిషాలకు (60శాతం) తగ్గించింది. వాహనదారులు గత ఏడాది ట్రాఫిక్ రద్దీ కారణంగా 35 గంటల విలువైన సమయాన్ని కోల్పోయారని ఒక సర్వే తెలిపింది.
దుబాయ్ యొక్క రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ట్రాఫిక్ రోడ్స్ ఏజెన్సీ సీఈఓ హుస్సేన్ అల్ బన్నా మాట్లాడుతూ.. “2024లో అమలు చేయబడిన ట్రాఫిక్ పరిష్కారాలు రహదారి నెట్వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. వాహనాల వెగాన్ని పెంచింది. దుబాయ్‌లోని వివిధ ప్రదేశాలలో ప్రయాణ సమయాన్ని 60 శాతం వరకు తగ్గించడంలో సహాయపడింది. ఈ అప్డేట్ లు అనేక ప్రాంతాల్లో రహదారి సామర్థ్యాన్ని 20 శాతం వరకు పెంచాయి.” అని పేర్కొన్నారు.
RTA ఇటీవల చేపట్టిన ప్రాజెక్ట్‌లు ప్రధానంగా రహదారి విస్తరణలు, కూడలి అప్గ్రేడ్లు, స్కూల్ జోన్ లపై ఫోకస్ పెట్టాయి. అల్ రెబాట్ స్ట్రీట్‌కు దారితీసే ఎగ్జిట్ 55 పొడిగింపు అత్యంత ప్రభావవంతమైన ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఇక్కడ లేన్ల సంఖ్య రెండు నుండి మూడుకి పెరిగింది. విస్తరణతో 600 మీటర్ల రహదారి సామర్థ్యం గంటకు 4,500 వాహనాలకు పెంచింది. ప్రయాణ సమయాన్ని 10 నిమిషాల నుండి కేవలం 4 నిమిషాలకు(60 శాతం) తగ్గించిందని వివరించారు.
నాద్ అల్ షెబాలో RTA మేడాన్ స్ట్రీట్ నుండి కొత్త ఎంట్రీ, ఎగ్జిట్ ను తీసుకొచ్చారు. లతీఫా బింట్ హమ్దాన్ స్ట్రీట్ , నాద్ అల్ షెబా స్ట్రీట్ వద్ద రెండు సర్కిళ్లను రౌండ్అబౌట్గా మార్చారు.ఈ మెరుగుదలలు ట్రాఫిక్ వేగాన్ని క్రమబద్ధీకరించాయి. ఆ ప్రాంతంలో రద్దీ తగ్గింది.
2024లో RTA ఎనిమిది పాఠశాలల ట్రాఫిక్ మెరుగుదల ప్రాజెక్టులను పూర్తి చేసింది. దుబాయ్ అంతటా 37 కంటే ఎక్కువ పాఠశాలలను కవర్ చేసింది. స్కూల్ జోన్ల చుట్టూ రోడ్లను విస్తరించడం, అదనపు పార్కింగ్ స్థలాల ఏర్పాటు, ఎంట్రీ/ఎగ్జిట్ పాయింట్లను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ట్రాఫిక్ మళ్లింపులను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి. ఫలితంగా పీక్-అవర్ ట్రాఫిక్ వేగం 20 శాతం మెరుగుపడిందన్నారు.
ఉమ్ సుఖీమ్ స్ట్రీట్‌లోని కింగ్స్ స్కూల్, ది ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ చౌయిఫాట్, హెస్సా స్ట్రీట్‌లోని దుబాయ్ కాలేజ్, అల్ సఫా, అల్ వార్కా 4, అల్ ఖుసైస్, అల్ మిజార్, నాద్ అల్ షెబా, అల్ ట్వార్ 2 వంటి సంస్థలతో పాటు ఈ ప్రాజెక్టుల ద్వారా లబ్ది పొందాయి. వీటి ఆధారంగా RTA 2025లో 75 అదనపు ట్రాఫిక్ మెరుగుదల ప్రాజెక్టులను అమలు చేయాలని యోచిస్తోందని తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







