ఇండియాలో ‘ఓపాజ్’ ప్రతినిధి బృందం పర్యటన..!!
- February 10, 2025
మస్కట్: ఒమన్, ఇండియా మధ్య ఆర్థిక, స్వేచ్ఛా, పారిశ్రామిక జోన్ల రంగంలో సహకారాన్ని పెంపొందించడం, పెట్టుబడులను ఆకర్షించడం, నైపుణ్యం, అనుభవాల షేరింగ్ అవకాశాలపై చర్చించే లక్ష్యంతో పబ్లిక్ అథారిటీ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అథారిటీ.. ఇండియాలో పర్యటించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఫ్రీ జోన్‌ల వైస్ ఛైర్మన్ హిస్ ఎక్సలెన్సీ ఇంజినీర్ అహ్మద్ బిన్ హసన్ అల్-ధీబ్ నేతృత్వంలోని అథారిటీ ప్రతినిధి బృందం.. అంగుల్‌లోని జిందాల్ ఐరన్ అండ్ స్టీల్ గ్రూప్ ప్రాజెక్ట్‌ల వంటి అనేక భారతీయ పారిశ్రామిక, ఆర్థిక కంపెనీలు, సంస్థలను సందర్శించారు. జిందాల్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ, విద్యా కార్యక్రమాలు, పరిశోధనా కేంద్రాలు, విద్యా మ్యూజియం, సేవా విద్యా సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఇండియాలోని ఒమన్ రాయబార కార్యాలయం.. పబ్లిక్ అథారిటీ సహకారంతో రెండు స్నేహపూర్వక దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపన 70వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా వివిధ రకాల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ రంగాలలో పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారులకు అందించిన ప్రోత్సాహకాలు, అత్యంత ప్రముఖమైన లక్ష్య రంగాలను సమీక్షించే వర్కింగ్ పేపర్‌ను హిజ్ ఎక్సలెన్సీ అథారిటీ వైస్ చైర్మన్ అహ్మద్ బిన్ హసన్ అల్-ధీబ్ విడుదల చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను వివరించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో రెండు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంలో ప్రత్యేక ఆర్థిక మండలాలు, ఫ్రీ జోన్‌లు, పారిశ్రామిక నగరాల పాత్రను అదే సమయంలో ఒమన్ సుల్తానేట్‌లో పెట్టుబడి అవకాశాలను హిస్ ఎక్స్‌లెన్సీ వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







