డైరెక్టర్ రామ్ నారాయణ్ తో మాగల్ఫ్ ముఖాముఖీ
- February 12, 2025
మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది.ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది.పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది.ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ నారాయణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
లైలా ఐడియా ఎప్పుడు వచ్చింది ? ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయ్యింది?
-బట్టల రామస్వామి బయోపిక్ సినిమా చేశాను.అది 2021లో రిలీజై మంచి హిట్ అయ్యింది.ఈ సినిమా తర్వాత ఓ యూనిక్ కథ చేయాలనుకున్నాను.హీరో లేడి గెటప్ వేయడం యూనిక్ కాన్సెప్ట్. ఈ మధ్య అలాంటి కథలు రాలేదు.క్యారెక్టరైజేషన్ కుదిరితే అద్భుతంగా వస్తుంది. బ్యూటీపార్లర్ లో పని చేసే మేల్ క్యారెక్టర్ ని పెడితే లాజికల్ గా జస్టిఫికేషన్ వస్తుందనే ఆలోచన కథ రాయడం మొదలుపెట్టాను.ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ నాకు చాలా ఇష్టం. ఆ బ్యాక్ డ్రాప్ లో సినిమా బాగా కుదిరింది. ఇది పెర్ఫెక్ట్ ఎంటర్ టైనర్.
-హీరోని వెదకడం చాలా ఛాలెంజ్ గా అనిపించింది.ఈ క్యారెక్టర్ చేయడానికి చాలా గట్స్ కావాలి. లాస్ట్ హోప్ గా విశ్వక్ ఓకే చేశారు.విశ్వక్ ఒప్పుకోవడం సాహు గారి గ్రేట్ నెస్. విశ్వక్ కి మాస్ ఇమేజ్ వుంది. కథ చెప్పినపుడు తను ఎలా తీసుకుంటారో అనే భయం వుండేది. విశ్వక్ కి ఇలాంటి లేడీ గెటప్ చేయాలని కోరిక వుండేది.ఇంతకు ముందు రెండు కథలు విన్నారట.ఈ కథ ఆయనకి బాగా కనెక్ట్ అయ్యింది. విశ్వక్ రావడంతో ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది.
ట్రైలర్ చూస్తే బోల్డ్ నెస్ ఎక్కువైయిందని అనిపిస్తోంది?
-ఇందులో వల్గారిటీ వుండదు. నాటీనెస్ వుంటుంది. ఈ కథకు ఆ నాటీనెస్ కావాలి. విజువల్ గా సినిమా చాలా క్లీన్ గా వుంటుంది. క్లాస్ మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసేలా వుంటుంది.
విశ్వక్ కి లేడి గెటప్ కోసం ఎలాంటి వర్క్ చేశారు?
-లేడి గెటప్ అంటే మాకూ భయమే. అయితే రెమో సినిమాకి ప్రోస్తటిక్ చేసిన నిక్కీని సంప్రదించాం. విశ్వక్ లేడి గెటప్ లో అదిరిపోతారని నిక్కీ చెప్పడంతో మాకు ఇంకా నమ్మకం వచ్చింది. మేము ముందు ఎఐ లో క్రియేట్ చేసి చూసుకున్నాం.తర్వాత లుక్ టెస్ట్ చేశాం. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు అవి విశ్వక్ కళ్ళు కాదని చాలమంది అనుకున్నారు.నిజానికి అవి ఆయన కళ్ళే. నా దగ్గర ఒరిజినల్ ఫొటోస్ కూడా వున్నాయి.
ఇందులో మదర్ ఎమోషన్ వుందని విన్నాం?
-అవును.సోనూ మోడల్ కి ఆ పార్లర్ అంటే ఎందుకు అంత ఇష్టం అనేది చాలా ఎమోషనల్ గా వుంటుంది.కామెడీ యాక్షన్ రోమాన్స్ ఎమోషన్ అన్నీ వుంటాయి. విశ్వక్ సినిమా నుంచి ఏం ఆశిస్తామో అందుకు పదిరెట్లు ఎక్కువగా వుంటుంది.
ఇందులో విశ్వక్ రెండు పాటలు రాశారు కదా?
-అవును. ఆయన లిరిక్స్ కూడా రాస్తారా అని నాకు తెలీదు.ట్యూన్ పంపిన తర్వాత తను ఓ పాట వినిపించారు. ఎవరు రాశారని అడిగాను. నేనే అని చెప్పారు.తను అప్పటికప్పుడే రాసేస్తాడు.
-లియోన్ జోన్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. తనకి విశ్వక్ కి మంచి సింక్ వుంది. అది ఈ సినిమాకి ప్లస్ అయ్యింది.
-రిచర్డ్ ప్రసాద్ బ్యూటీఫుల్ విజవల్స్ ఇచ్చారు. ఆయన చాలా విజనరీ కెమరామ్యాన్.
విశ్వక్ లో డైరెక్టర్ కూడా వున్నాడు కదా.. అది మీకు హెల్ప్ అయ్యిందా?
- ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. ఒక నటుడికి అన్నీ తెలిసుంటే చాలా హెల్ప్ అవుతుంది. డైరెక్టర్ చాలా ఫ్రీ అయిపోతాడు. తన విజన్ నాకు చాలా ఇష్టం. చాలా మంచి పాజిటివ్ గా ఈ జర్నీ జరిగింది.
కామాక్షి క్యారెక్టర్ గురించి?
-మేము ఇంకా ఆ క్యారెక్టర్ రివిల్ చేయలేదు. చాలా స్పెషల్ క్యారెక్టర్. సినిమా చూసి 'వావ్' అంటారు. అద్భుతంగా నటించారు. చాలా సపోర్ట్ చేశారు.
లైలా టైటిల్ గురించి?
-ఇందులో సోను మోడల్ లైలా..ఈ రెండు క్యారెక్టర్స్ పై కథ నడుస్తుంది. లైలా ఈ సినిమాకి యూఎస్పీ. లైలా వచ్చిన తర్వాత స్క్రీన్ పై మ్యాజిక్ వుంటుంది. అందుకే సినిమాకి లైలా యాప్ట్ టైటిల్. లైలా గెటప్ లో విశ్వక్ చూసి వారి ఫ్యామిలీ చాలా సర్ ప్రైజ్ అయ్యారు. ఈ క్యారెక్టర్ కోసం చాలా కష్టపడ్డారు. ఆయన కష్టానికి తగిన ఫలితం వస్తుంది.
-ఇందులో కామాక్షి, ఆకాంక్ష, అభిమన్యు సింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా కీలకంగా ఉంటాయి. ఇందులో అభిమన్యు సింగ్ కామెడీని చాలా ఎంజాయ్ చేస్తారు. ఆకాంక్ష ది జిమ్ ట్రైనర్ క్యారెక్టర్. తను మంచి డ్యాన్సర్. వారి కెమిస్ట్రీ చాలా బ్యూటీఫుల్ గా వుంటుంది.
నిర్మాత సాహు గురించి?
-ఈ సినిమాకి సాహు మెయిన్ పిల్లర్. ఆయన వలనే సినిమా ముందుకు వెళ్ళింది.కథ విన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశారు. ఆయన ద్వారానే విశ్వక్ ప్రాజెక్ట్ లోకి వచ్చారు.విశ్వక్ తో సినిమా చేయడం నాకు పెద్ద ఎచీవ్మెంట్.
నటనపై మీకు ఆసక్తి ఉందా?
-ప్రస్తుతానికి దర్శకత్వంపైనే నా దృష్టి వుంది.నిజానికి మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. బట్టల రామస్వామి సినిమాకి నేనే మ్యూజిక్ చేశాను.దిల్ దివాన, ఉందిలే మంచి కాలం సినిమాలకు మ్యూజిక్ చేశాను.అప్పుడే భాను మాస్టర్ పరిచయం.ఆయన లైలాకి బ్యూటీఫుల్ గా కొరియోగ్రఫీ చేశారు.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?
ప్రస్తుతం నా ఫోకస్ లైలా రిలీజ్ పైనే వుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







