ప్రధాని మోడీ విమానం పై ఉగ్రదాడి చేస్తాం...ముంబై పోలీస్ లకు కాల్
- February 12, 2025
న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించే విమానంపై ఉగ్రదాడి జరగవచ్చని పోలీసులకు వార్నింగ్ నోట్ రావడం కలకలం రేపింది. ప్రధాని మోదీ ఇవాళ, రేపు అమెరికాలో పర్యటించనున్నారు. ఇటువంటి సమయంలో మోదీ విమానానికి బెదిరింపులు రావడం గమనార్హం. ఈ బెదిరింపు నోట్‌పై ముంబై పోలీసులు ఓ ప్రకటన చేశారు.
మోదీ విదేశాల్లో అధికారిక పర్యటన చేయనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 11న ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ వచ్చిందని, మోదీ విమానంపై దాడి చేస్తామని అన్నారని అధికారులు తెలిపారు. దీనిపై ఏజెన్సీలకు సమాచారం ఇచ్చామని, దర్యాప్తు జరుగుతోందని వివరించారు. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని చెంబూర్ ప్రాంతం నుంచి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అతను మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పారు.
కాగా, ప్రధాని మోదీ నాలుగు రోజుల ఫ్రాన్స్, అమెరికా పర్యటనను సోమవారం ప్రారంభమైంది. ఇవాళ మోదీ పారిస్ పర్యటన అనంతరం అక్కడి నుంచి నేరుగా అమెరికాకు వెళ్లనున్నారు.
ఇప్పటికే మోదీ పారిస్‌లో జరిగే ఏఐ సదస్సులో పాల్గొన్నారు. అమెరికాలో మోదీ రెండు రోజులపాటు పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది.
మోదీని ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారని ఇప్పటికే వైట్‌హౌస్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. రేపు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ సమావేశం అవుతారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై టారిఫ్‌లు విధిస్తున్నారు. ఈ సమయంలో మోదీ యూఎస్ వెళ్తుండడం ఈ పర్యటనకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







