సస్పెన్స్ థ్రిల్లర్ 'రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి'
- February 12, 2025
ఓటీటీలో ఎక్కువ ఆదరణ పొందుతున్న జానర్స్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే "రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి" సినిమాపై ఓటీటీ ప్రేక్షకులకు అంతగా అభిమానం ఏర్పడింది. ఎట్టకేలకు ఈ సినిమా అమోజాన్ ప్రైమ్స్ లో అందుబాటులోకి రావడంతో సంతోషం.
తన్విక, మోక్షిక క్రియేషన్స్ బానర్ పై రాజేష్ గురజావోలు నిర్మించిన చిత్రం 'రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి'. సత్యరాజ్ కుంపట్ల దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. తాజాగా ఫిబ్రవరి 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి పెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ లో నిమా స్ట్రీమింగ్ అవుతుంది అంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమాలో ఎలాంటి కంటెంట్ ఉందో.
కథ విషయానికి వస్తే.. పల్లెటూరులో జరిగే కథ ఇది. నాయుడు గారి అబ్బాయి కర్ణ(రవితేజ నున్న) ఊరిలో జులై గా తిరిగే కుర్రాడు.అదే ఊర్లో రాజు గారి అమ్మాయి అను(నేహా జురెల్)ను ఇష్టపడుతాడు.ఇద్దరి లవ్ జర్నీలో ఒకరోజు అనుకు ఫిజికల్ గా దగ్గర అవ్వాలి అనుకుంటాడు. దానికి అను తిరస్కరిస్తుంది. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాతి రోజు అను శవమై కనిపిస్తుంది. ఆ మర్డర్ కు కర్ణకు ఏంటి సంబంధం? అనును చంపింది ఎవరు? తన మరణానికి కర్ణ స్నేహితులకు ఏంటి సంబంధం? కర్ణ తండ్రి నాగినీడు పాత్ర ఏంటి? మర్డర్ మిస్టరీని ఇన్వెస్ట్ గేట్ ఎలా సాగుతుంది? ఇంతకీ అను చనిపోయిందా లేదా చివరికి ఏమైంది? అనేది రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి సినిమా.
అన్ని భావోద్వేగాలతో సాగే ఈ సిినిమాలోలో ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాగా సాగుతోంది. ఆధ్యాంతం ప్రేక్షకుడిని కట్టుపడేసేలా ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. ఈ ఇన్వెస్టిగేషన్లో ఊహించని రహస్యాలు, మలుపులు ఊపిరి బిగపట్టేలా చేస్తాయి. ముఖ్యగా హీరో రవితేజ నున్న యాక్టింగ్ చాలా బాగుంటుంది. ఎక్కడ నటించాడు అన్న ఫీల్ రాదు. చాలా సహజంగా చేశారు. హీరోయిన్ నేహా జురెల్ ప్రతీ సన్నివేశంలో ప్రేక్షకుడి చూపు తన నుంచి తిప్పుకోకుండా నటించింది. తన పాత్రకు ప్రాణం పోసింది. క్యారెక్టర్ ఆర్టిస్టులు నాగినీడు, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ అశోక్, ప్రమోదిని తమ పాత్రల మేర ఆకట్టుకున్నారు. సినిమాకు టెక్నికల్ అంశాలు అద్భుతంగా తోడయ్యాయి. మ్యూజిక్, సౌండ్ మిక్సింగ్, బీజీఎమ్ సినిమాకు హైలెట్. సినిమాటోగ్రఫీ అబ్బురపరుస్తుంది. అలాగే దర్శకుడు సత్య రాజ్ కుంపట్ల ప్రతీ ఫ్రేమ్ లో తన ప్రతిభ కనబరిచారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. థియేటర్ లో మిస్ అయిన వారు కచ్చితంగా ఓటీటీలో అద్భుతమై థ్రిల్ ను ఫీల్ అవుతారు.
చిత్రం: రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి
బ్యానర్: తన్విక & మోక్షిక క్రియేషన్స్
నటీ నటులు: రవితేజ నున్న, నేహా జూరెల్, నాగినీడు, ప్రమోదిని, యోగి ఖాత్రి, జబర్దస్త్ బాబి, జబర్దస్త్ అశోక్, ఆ దూరి దుర్గ నాగ మోహన్ తదితరులు
సంగీత దర్శకుడు: రోషన్ సాలుర్
సినిమాటోగ్రాఫర్: మురళీకృష్ణ వర్మన్
ఎడిటర్ : కిషోర్ తిరుమల
రచన: సత్య రాజ్ కుంపట్ల
నిర్మాత: రాజేష్ గొరిజవోలు
దర్శకత్వం: సత్య రాజ్ కుంపట్ల
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







