EGDI 2024: డిజిటల్ సేవల్లో సౌదీ అరేబియాకు 4వ స్థానం..!!

- February 13, 2025 , by Maagulf
EGDI 2024: డిజిటల్ సేవల్లో సౌదీ అరేబియాకు 4వ స్థానం..!!

రియాద్:  ఐక్యరాజ్యసమితి ఇ-గవర్నమెంట్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ 2024 (EGDI 2024)లో సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా నాల్గవ స్థానంలో నిలిచింది. EGDI 2024లో కింగ్‌డమ్ 25 స్థానాలు ఎగబాకి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దేశాల సమూహంలో ఒకటిగా నిలిచింది. ఇది ఇ-పార్టిసిపేషన్ ఇండెక్స్‌లో ఏడవ స్థానాన్ని సాధించడంతో పాటు డిజిటల్ సేవల సూచికలో G20 దేశాలలో రెండవ స్థానంలో, ప్రాంతీయంగా మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 193 నగరాల్లో రియాద్ నగరం మూడో స్థానాన్ని సాధించిందని కమ్యూనికేషన్స్,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి, డిజిటల్ గవర్నమెంట్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ ఇంజి. అబ్దుల్లా అల్-స్వాహా తెలిపారు. 

సౌదీ విజన్ 2030 ప్రణాళికలు, కార్యక్రమాలను ప్రతిబింబించేలా సౌదీ అరేబియా డిజిటల్ సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. యునైటెడ్ నేషన్స్ ఇ-గవర్నమెంట్ డెవలప్‌మెంట్ ఇండెక్స్‌లో కింగ్‌డమ్ కొనసాగుతున్న పురోగతి అన్ని విభాగాల లబ్ధిదారులకు అత్యుత్తమ ప్రభుత్వ డిజిటల్ సేవలను అందించడానికి తెలివైన నాయకత్వం మద్దతును ప్రతిబింబిస్తుందని అహ్మద్ అల్సువైయన్ వివరించారు.   UN నివేదికలో డిజిటల్ ప్రభుత్వ రంగంలో సౌదీ అరేబియా పురోగతిని ప్రశంసించారు. సౌదీ విజన్ 2030 లో భాగంగా భారీ పెట్టుబడులు తరలివచ్చాయని తెలిపింది.

టెలికమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండెక్స్ (TII)లో 53 ర్యాంక్‌తో సౌదీ దూసుకెళ్లింది. 31 ర్యాంక్‌ల పురోగతితో మానవ మూలధన సూచిక (HCI)లో చెప్పుకోదగిన పురోగతిని సాధించింది. 100 శాతానికి చేరుకున్న ప్రభుత్వ డిజిటల్ నిబంధనలతో పాటు, ఎలక్ట్రానిక్ సర్వీసెస్ ఇండెక్స్ (OSI), 67 ర్యాంక్‌ల పురోగతిని నివేదికలో హైలైట్ చేశారు. పౌరులు, వ్యాపార రంగాల కోసం బహిరంగ ప్రభుత్వ డేటా లభ్యత శాతం 100 శాతానికి చేరుకుంది. సౌదీ అరేబియా ఎలక్ట్రానిక్ పార్టిసిపేషన్, వ్యక్తులు-వ్యాపార రంగాలకు సంబంధించిన సంప్రదింపులలో 60 ర్యాంక్‌లను సాధించిందని తెలిపారు.

ఇ-గవర్నమెంట్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ 20 సంవత్సరాలకు పైగా అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ సూచికలలో ఒకటి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నివేదికను విడుదల చేస్తారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com