పాండిచ్చేరిలో పరిశుభ్రతను పాటించే వారికి కబాలి టికెట్లు ఉచితం
- July 02, 2016
కబాలి చిత్ర ప్రమోషన్‌ను ఈ చిత్ర వర్గాలు ఎన్ని విధాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. ఈ చిత్రం ఇప్పటికే ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇక ఈ చిత్రానికి గ్లోబల్ ప్రచారం జరుగుతోందని ఏషియన్ విమానం మీద పోస్టర్లతోనే అర్థం అవుతోంది.
ఈ నెల 15 లేదా 22న కబాలి చిత్రం తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాగా పుదుచ్చేరిలో స్వచ్ఛభారత్ సేవా కార్యక్రమాలకు రజనీకాంత్ సహకరించాలనీ, వాణిజ్య పరంగా అభివృద్ధికి చేయూతనివ్వాలని రాష్ట్ర గవర్నర్ కిరణ్‌బేడి ఇటీవల విజ్ఞప్తి చేశారు. పాండిచ్చేరిలో కబాలి చిత్ర విడుదల హక్కులను పొందిన లెజెండ్స్ మీడియా అధినేత జీపీ.సెల్వకుమార్ ఇటీవల కిరణ్‌బేడి, ముఖ్యమంత్రి నారాయణస్వామిని కలిసి పైరసీని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పైరసీని పూర్తిగా అరికడతామని గవర్నర్ హామీ ఇచ్చారని సెల్వకుమార్ వెల్లడించారు. పాండిచ్చేరిలో తమ ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించే వారికి కబాలి టికెట్లను ఉచితంగా అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







