WPL2025: తొలి మ్యాచ్ నేడే

- February 14, 2025 , by Maagulf
WPL2025: తొలి మ్యాచ్ నేడే

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కు వేళైంది. నేటి నుంచి మూడో సీజన్ ప్రారంభంకానుంది. గత రెండు సీజన్లు విజయవంతం కావడంతో ఈ సారి టోర్నీపై భారీ అంచనాలే ఉన్నాయి. 2023లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవగా.. 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చాంపియన్‌గా నిలిచాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 ఈ రోజు ప్రారంభమవుతుంది.మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీ పడతాయి.వడోదరలో రాత్రి 7:30కి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే WPL తొలి సీజన్ 2023లో ప్రారంభమైంది. ఫస్ట్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ విజేతగా నిలవగా.. రెండో సీజన్‌లో RCB శాసించింది. కాగా నేటి నుంచి ఈ మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. ఇప్ప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్ జట్లు 4 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో బెంగళూరు 2 మ్యాచ్‌ల్లో, గుజరాత్ 2 మ్యాచ్‌ల్లో గెలిచాయి. రెండు జట్లలో కీలక ఆటగాళ్లు బెంగళూరులో కెప్టెన్ స్మృతి మంధాన, ఆలిస్ పెర్రీ వంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు గుజరాత్ లో శుభమన్ గిల్ స్నేహితురాలు హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్నర్, డియాండ్రా డాటిన్ వంటి స్టార్ ఆటగాళ్ళు ఉండడంతో మొదటి మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది. ప్రస్తుతం స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్‌లో ఉంది. కెప్టెన్ మెగ్ లానింగ్ తో కలిసి షెఫాలీ వర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తుంది. షఫాలీ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగల సామర్థ్యం ఉన్న క్రీడాకారిణి. దీనితో పాటు, మెగ్ లానింగ్ ప్రత్యేకత ఏమిటంటే, ఆమె ఇన్నింగ్స్‌ను నిర్మించడమే కాకుండా, బలమైన షాట్లు కూడా ఆడగలదు. జట్టుకు మూడవ స్థానంలో జెమీమా రోడ్రిగ్స్ రూపంలో గొప్ప ఎంపిక కూడా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com