నెట్‌స్పీడ్‌ను చెక్ చేసేందుకు ట్రాయ్ కొత్త ఆప్
- July 02, 2016
ఇంటర్నెట్ స్పీడ్‌పై వస్తున్న పలు ఫిర్యాదులతో ట్రాయ్ స్పందించింది. నెట్‌స్పీడ్‌ను చెక్ చేసేందుకు ట్రాయ్ ఓ మొబైల్ యాప్‌ను ఆవిష్కరించనుంది. మై స్పీడ్ పేరుతో ఆవిష్కరించనున్న ఈ అప్లికేషన్‌ను ది మొబైల్ సేవా యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని వినియోగదారులు తమ మొబైల్‌లో ఇంటర్నెట్ స్పీడ్‌ను చెక్ చేసుకొని దాని ఫలితాలను ట్రాయ్ ఎనలిటిక్స్ పోర్టల్‌కు పంపించే అవకాశం ఉంది. కవరేజీ, డేటా స్పీడు, నెట్‌వర్క్ ఇన్ఫర్మేషన్, డివైజ్, ప్రాంతం వంటి అంశాలను మొత్తాన్ని ఈ అప్లికేషన్ సేకరించి పంపిస్తుంది. జులై 5 తేదీన ఈ పోర్టల్‌ను, అప్లికేషన్‌ను లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. నాణ్యత లేని ఇంటర్నెట్ సేవలపై తరచూ వినియోగదారులు ఫిర్యాదులు చేస్తుండటం.. కొందరు ఆపరేటర్లు 3జీ సేవల స్థానంలో 2జీ సేవలు అందిస్తున్న విషయం ట్రాయ్ సర్వేలో బయటపడటంతో ఈ యాప్‌ను ఆవిష్కరిస్తున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







