అమర్ నాథ్ యాత్రీకులకు బీఎస్ఎన్ఎల్ వారి "స్పెషల్ యాత్రా సిమ్ కార్డ్స్"
- July 02, 2016
అమర్ నాథ్ యాత్రికుల కోసం జమ్మూకశ్మీర్ బీఎస్ఎన్ఎల్ "స్పెషల్ యాత్రా సిమ్ కార్డ్స్"లను ప్రవేశపెట్టింది. దక్షిణ కశ్మీరంలో పటిష్ట భద్రత నడుమ 48 రోజులపాటుసాగే అమర్‌నాథ్ యాత్ర శుక్రవారం నుంచి ప్రారంభమైంది. యాత్రికుల కమ్యూనికేషన్ అవసరాల నేపథ్యంలో ఈ స్పెషల్ యాత్ర సిమ్ కార్డులను బీఎస్ఎన్ఎల్ ప్రారంభించినట్టు పీఐబీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.బాల్తాల్, చందన్ వారీ నుంచి పవిత్ర గుహ వరకు మొబైల్ కనెక్టివిటీ ఉండేలా.. ఈ ప్రత్యేక కార్యక్రమం కింద బీఎస్ఎన్ఎల్ ప్రారంభించిన సిమ్ కార్డులను ప్రవేశపెట్టిందని అధికారి చెప్పారు. లకన్ పుర్ బోర్డర్, భగవతి నగర్ బేస్ క్యాంపుల్లో ఈ స్పెషల్ యాత్రా సిమ్ కార్డులు అందుబాటులో ఉంటాయని, అదేవిధంగా బాల్టాల్, చందన్ వారీ ఔట్ లెట్స్ లో ఈ సిమ్ లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు.
ఈ సిమ్ కార్డు ద్వారా ఉచిత టాక్ టైమ్, ఆకర్షణీయమైన కాల్ చార్జీలు, ఏడు రోజుల ఉచిత డేటా వంటి సదుపాయాలను యాత్రికులు పొందవచ్చని ప్రతినిధి తెలిపారు. బేస్ క్యాంప్ భగవతి నగర్ జమ్మూలో యాత్రికుల కోసం స్పెషల్ కస్టమర్ సర్వీసు సెంటర్ ను రూపొందించారు. హెల్ప్ లైన్ నెంబర్ గా 0191-2555556 ఉంచినట్టు అధికార ప్రతినిధి వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







