మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..

- February 17, 2025 , by Maagulf
మీరు పోస్టాఫీసులో రోజుకు రూ.50 పెట్టుబడి పెడితే చాలు..

ప్రస్తుత రోజుల్లో చాలా మంది పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. పోస్ట్ ఆఫీస్ స్కీమ్‌లో చిన్న పెట్టుబడితో కూడా తక్కువ సమయంలోనే ఎక్కువ రాబడిని పొందవచ్చు.

మీరు ప్రతిరోజూ రూ.50 పోస్టాఫీసులో డిపాజిట్ చేస్తే.. కేవలం 5 సంవత్సరాలలో మీరు ధనవంతులు కావచ్చు.పోస్టాఫీసు పొదుపు పథకాలు అనేవి చాలా సురక్షితమైన పెట్టుబడి ఎంపికలుగా చెప్పవచ్చు.ఈ పథకాలకు ప్రభుత్వం మద్దతు కూడా ఉంటుంది.పెట్టుబడి పూర్తిగా సురక్షితమని చెప్పవచ్చు.అందుకే చాలామంది పోస్టాఫీసు పథకాలలో భారీగా పెట్టుబడి పెడుతుంటారు.

తక్కువ పొదుపు.. అధిక రాబడి:
పోస్ట్ ఆఫీస్ పథకంలో ప్రతిరోజూ చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా కాలక్రమేణా పెద్ద మొత్తాన్ని కూడబెట్టుకోవచ్చు.మీరు తక్కువ పెట్టుబడితో భారీగా సంపాదను పెంచుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా రోజుకు రూ.50 డిపాజిట్ చేస్తే చాలు..పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించుకోవచ్చు.తద్వారా మీరు ధనవంతులు కావచ్చు.రోజుకు రూ.50 ఆదా చేయడం ద్వారా కేవలం 5 ఏళ్లలో రూ.1,07,050 వరకు డబ్బును కూడబెట్టుకోవచ్చు.

ఒకవేళ మీరు పోస్ట్ ఆఫీస్ పథకంలో ప్రతి నెలా రూ.1500 పెట్టుబడి పెడితే మీరు 5 సంవత్సరాలలో మొత్తం రూ.90వేలు డిపాజిట్‌ను కలిగి ఉంటారు.మీకు దాదాపు రూ.17,050 అదనపు వడ్డీ వస్తుంది. లేదంటే..మీరు రోజుకు రూ.100 పెట్టుబడి పెడితే భారీ ప్రయోజనాలను పొందవచ్చు.రూ.50కి బదులుగా రూ.100 డిపాజిట్ చేస్తే మీ ఫండ్ రెట్టింపు అవుతుంది. మీరు రోజుకు రూ.100 ఆదా చేస్తే.. 5 సంవత్సరాలలో రూ.2,14,097 లక్షలను ఈజీగా సంపాదించవచ్చు.

ఇందులో మరో ప్రయోజనం ఏమిటంటే.. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం మీకు సంవత్సరానికి దాదాపు 6.7 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. స్థిర డిపాజిట్లు, ఇతర పథకాలతో పోలిస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు.. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకంలో రుణ సౌకర్యం కూడా ఉంది. కనీసం 12 వాయిదాలు డిపాజిట్ చేసిన తర్వాత, మీరు మీ డిపాజిట్ మొత్తంలో 50శాతం వరకు రుణం పొందవచ్చు.

దీర్ఘకాలిక పెట్టుబడి మార్గం ద్వారా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకంలో కాలపరిమితి 5 సంవత్సరాలు ఉంటుంది. అవసరమైతే మరో 5 సంవత్సరాలు కూడా పొడిగించవచ్చు. పెట్టుబడికి ప్రత్యేకమైన ఈ పథకంలో అవసరమైతే అకౌంట్ 3 సంవత్సరాల తర్వాత క్లోజ్ చేయొచ్చు.

అయితే, పొదుపు ఖాతా ప్రకారం వడ్డీ రేటు అందుకోవచ్చు. అంతేకాదండోయ్.. పన్ను ఆదా ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం పన్ను నుంచి ప్రయోజనాలు ఉంటాయి. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెడితే.. సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందవచ్చు.

పోస్టాఫీసులో అకౌంట్ ఓపెన్ చేశారా?
క్రమం తప్పకుండా పొదుపు చేసే అలవాటు చేసుకోండి. ఈ పథకంలో పొదుపు చేయడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణను కలిగి ఉండటంలో మీకు సాయపడుతుంది. పోస్టాఫీసులో ఈ అకౌంట్ ఓపెన్ చాలా సులభం కూడా దీనికి కావాల్సిందిల్లా.. ఆధార్, పాన్ కార్డ్, కనీస డిపాజిట్ మొత్తం మాత్రమే అవసరం ఉంటుంది.

ఇంకెందుకు ఆలస్యం..మీరు కూడా పోస్టాఫీసులో ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా?ఇప్పుడే వెళ్లి మీ దగ్గరలోని పోస్టాఫీసు వద్దకు వెళ్లి సంప్రదించండి. కేవలం 5 ఏళ్లలో మీరు లక్షాధికారులు అయిపోండి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com