పన్నీర్ ముట్టన్ కర్రీ
- July 02, 2016

కావలసిన పదార్థాలు: బోన్‌లెస్ మటన్ - 500 గ్రా., పనీర్ - 150 గ్రా., కారం - 1 టీ స్పూను, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 10 రేకలు, పచ్చిమిర్చి - 4, లవంగాలు - 5, ఉల్లిపాయ - 1, దాల్చినచెక్క - అంగుళం ముక్క, యాలక్కాయ - 1, మిరియాలు - అర టీ స్పూను, జీలకర్ర - 2 టీ స్పూన్లు, దనియాలు - 2 టీ స్పూన్లు, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: మటన్‌లో కొద్దిగా నూనె, కారం, పసుపు, చిటికెడు ఉప్పు కలిపి మూత పెట్టి పక్కనుంచాలి. కడాయిలో దనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చినచెక్క, యాలక్కాయ, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి వేగించి అన్నీ కలిపి పేస్టు చేసుకోవాలి. ఇంకో కడాయిలో నూనె వేసి మసాల పేస్టు కారం, పసుపు, ఉప్పు కలపాలి. నూనె పైకి తేలిన తర్వాత మటన్ ముక్కల్ని వేసి బాగా కలిపి మూతపెట్టాలి. 10 నిమిషాల తర్వాత అర లీటరు నీరు పోసి చిన్న మంటపై మెత్తగా ఉడికించాలి. తర్వాత కొద్ది నూనెలో (దోరగా కాకుండా) వేగించిన పనీర్‌ను కలపాలి. 5 నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కర్రీ పరాటాతో పాటు అన్నంలోకి కూడా బాగుంటుంది.
తాజా వార్తలు
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!









