ఎన్‌ఐఏ దర్యాప్తులోకీలక అంశాల వెల్లడి

- July 02, 2016 , by Maagulf
ఎన్‌ఐఏ దర్యాప్తులోకీలక అంశాల వెల్లడి

ఇస్లామిక్ స్టేట్ స్థాపనకు ప్రతిజ్ఞ చేశాం...ఆ వీడియో మెసేజ్‌ను ఐఎస్‌ఐఎస్ చీఫ్ బాగ్దాదీకి పంపించాం హైదరాబాద్‌లో పట్టుబడ్డ ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులు శనివారం ఎన్‌ఐఏ మొదటిరోజు విచారణలో వెల్లడించిన సంగతులివి. హైదరాబాద్‌తోపాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో విధ్వంసాలకు పాల్పడేందుకు కుట్రపన్నిన వ్యవహరంలో అరస్టైన ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరులను కస్టడీలోకి తీసుకుని ఎన్‌ఐఏ శనివారం నుంచి విచారణను ప్రారంభించింది. మొదటి రోజు వెలుగులోకి వచ్చిన విషయాలతో మరికొంత మంది అనుమానితుల వివరాలను ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. పేలుళ్ల కోసం బాంబులు తయారీ చేయడంతో పాటు విధ్వంసం త్వరాత పోలీసులకు దొరకకుండా దాక్కొనేందుకు ఈ యువకులు హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో రహస్య స్థావరాల కోసం గాలించారు. నగరంలో బాంబు పేలుళ్ళు జరపాలని నిర్ణయించుకున్న యువకులు ఐదుగురిలో ఎవరెవరు ఏయే బాధ్యతలను నిర్వహించాలనేది ముందుగానే అనుకున్నారట. ఎన్‌ఐఏ అధికారులు తమ విచారణలో ఈ సంగతిని రాబట్టారు. ఈ ఐదుగురికి అరబ్ దేశాల నుంచి హవాలా, మనీట్రాన్స్‌ఫర్ సంస్థల ద్వారా నగదు అందినట్టు వెల్లడైంది. దీంతో వీరి లావాదేవీలపై ఎన్‌ఐఏ ఆధారాలు సేకరిస్తున్నది. వీరంతా నిత్యం నేరుగా కలుసుకోకుండా ఈమెయిల్, చాటింగ్ ద్వారా మాట్లాడుకునేవారు. అదేవిధంగా తమకు ఆదేశాలు జారీచేసే ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదితో కూడా వీరు ఈమెయిల్, చాటింగ్ ద్వారానే సంప్రదింపులు జరిపేవారట. బాంబుల తయారీ కోసం కావాల్సిన పేలుడు పదార్థాలు, రసాయనాలు, తుపాకులను హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి సేకరించినట్టు వివరించారు. పట్టుబడ్డ ఐదుగురిలో ఒకరు సిరియా వెళ్లేందుకు ప్రయత్నించినట్టు కూడా ఎన్‌ఐఏ విచారణలో బయటపడింది. పట్టుబడ్డ వారిలో ఇబ్రహీం, ఇలియాజ్‌లు అన్నదమ్ములని హబీబ్, ఫహాద్‌లు దగ్గరి బంధవులను తేలింది. వీరి దగ్గర దొరికిన పేలుడు పదార్థాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com