హైదరాబాద్‌ సిటీ పోలీసులకు భారీగా అభినందనలు

- July 02, 2016 , by Maagulf
హైదరాబాద్‌ సిటీ పోలీసులకు భారీగా అభినందనలు

హైదరాబాద్‌లో ఐసిస్ అనుమానితులను పట్టుకున్న సిటీ పోలీసు, ఎన్‌ఐఏకు సోషల్ మీడియాలో భారీగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వాట్సాప్ ద్వారా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ లోగోతో పోలీసులకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి చేరగా వారు మన పోలీసులు గ్రేట్ అంటూ కితాబులు కురిపిస్తున్నారు. మేము హైదరాబాద్ ప్రజలం.. సిటీ పోలీసులు, ఎన్‌ఐఏ పోలీసులకు పది లక్షల ధన్యవాదాలు.. మా ప్రాణాలు కాపాడడంతో పాటు నగరంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పినందుకు అంటూ ప్రత్యేకంగా రూపొందించిన లోగోలో తమ మెసేజ్‌ను వివరించారు. ఇందులో హైదరాబాద్ సిటీ పోలీసు, ఎన్‌ఐఏ శాఖల లోగోలు కూడా ఉన్నాయి. ఇలా నగర ప్రజలు సిటీ పోలీసులపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఎలాంటి అభద్రతాభావం లేదని నిరూపిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com