ఆటా వేడుకల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత
- July 02, 2016
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోగల చికాగోలో అట్టహాసంగా ప్రారంభమైన ఆటా వేడుకల్లో రెండో రోజు తెలంగాణ బతుకమ్మ కొలువు దీరింది. పలువురు తెలంగాణ ఎన్నారై మహిళలు రంగురంగుల పూలతో పెద్ద పెద్ద బతుకమ్మలతో తరలివచ్చారు. అమ్మవారి ప్రతిమతోపాటు, త్రిశూలాలు, ఇతర పూజా సామాగ్రి.. అచ్చం తెలంగాణ సంస్కృతి కొలువుదీరినట్లు కనిపించింది.ఈ కార్యక్రమం లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరిగింది. కవిత ఆటా ఉత్సవాల నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిన్నాపెద్దా అంతా ఈ వేడుకల్లో పాలుపంచుకోగా పలువురు తమ సెల్ ఫోన్లలో ఈ కార్యక్రమాన్ని బందించారు. బతుకమ్మ తరలి వస్తుంటే పలువురు ఆనందంతో నృత్యం చేశారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుక నిర్వాహకురాలు కవితతో ఫొటోలు దిగేందుకు అక్కడి వారు పోటీలు పడ్డారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







