హైదరాబాద్ సిటీ పోలీసులకు భారీగా అభినందనలు
- July 02, 2016
హైదరాబాద్‌లో ఐసిస్ అనుమానితులను పట్టుకున్న సిటీ పోలీసు, ఎన్ఐఏకు సోషల్ మీడియాలో భారీగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వాట్సాప్ ద్వారా ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ లోగోతో పోలీసులకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి చేరగా వారు మన పోలీసులు గ్రేట్ అంటూ కితాబులు కురిపిస్తున్నారు. మేము హైదరాబాద్ ప్రజలం.. సిటీ పోలీసులు, ఎన్ఐఏ పోలీసులకు పది లక్షల ధన్యవాదాలు.. మా ప్రాణాలు కాపాడడంతో పాటు నగరంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పినందుకు అంటూ ప్రత్యేకంగా రూపొందించిన లోగోలో తమ మెసేజ్‌ను వివరించారు. ఇందులో హైదరాబాద్ సిటీ పోలీసు, ఎన్ఐఏ శాఖల లోగోలు కూడా ఉన్నాయి. ఇలా నగర ప్రజలు సిటీ పోలీసులపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఇక్కడ ఎలాంటి అభద్రతాభావం లేదని నిరూపిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







