సాలిహియాలో అగ్నిప్రమాదం పలు ఆస్తుల దగ్ధం
- July 03, 2016
సాలిహియాలో గత రాత్రి జరిగిన ఒక అగ్నిప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తులు తగలబడిపోయాయి. పొరుగున ఉన్న రెస్టారెంట్ మరియు ఒక నివాస గృహం నాశనం కాబడ్డాయి. ఈ అగ్ని ప్రమాదం తొలుత ఒక ఆటో-సర్వీస్ వర్క్జషాప్ వద్ద మొదలుకాబడిందని అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది. పౌర రక్షణ అగ్నిమాపక దళం సకాలంలో స్పందించి మంటలను నియంత్రించిందిదని నిరార్దంచారు. ఈ ప్రమాదంలో ఏ ఒక్కరికీ ఎటువంటి గాయాలు నమోదు కాలేదని, ప్రమాదం కారణం గుర్తించడానికి ఒక విచారణని ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. కొందరు ప్రత్యక్ష సాక్షులు " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపిన సమాచారం ప్రకారం ఈ సంఘటన శుక్రవారం రాత్రి 8 గంటలకు షేక్ సల్మాన్ హైవే మీద ఉన్న ఆ వర్క్ షాప్ లో ఆ అగ్ని ప్రమాదం జరిగిందని వివరించారు."దట్టమైన పొగ ఆ ప్రాంతంలో చుట్టివేయడంతో ఆ సమీపంలోని నివాస ప్లాట్లవాసులని అగ్నిమాపక మరియు పోలీసుశాఖవారు ఆ ప్రాంతం నుంచి స్థానికులని ఖాళీ చేయించారని" ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పారు
అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం దగ్గరలో ఉండే ఒక దుకాణ యజమాని, మాట్లాడుతూ "రెండు షట్టర్లు ఉన్న వర్క్ షాప్ తొలుత అగ్ని ప్రమదం జరిగినట్లు తెలిపాడు. దీనితో పాటు మరో రెండు ఇళ్ళు మంటల ద్వారా ప్రభావితం కాబడి కొద్దిగా తగలబడ్డాయని తెలిపారు. కానీ అదృష్టవశాత్తూ ఈ అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. వర్క్ షాప్ లోపల నిలిపి ఉన్నవాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలిపారు.. " అగ్నిప్రమాదంలో మొత్తం నష్ట వివరాలు, ప్రమాదం కు కారణం ఏమిటో ఇప్పటి వరకు తెలియలేదని పరిశోధనలలో తెలియాల్సి ఉందని ఆ బహ్రేయినీ వ్యాపారి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







