ఛాంపియన్స్ ట్రోఫీ.. E311, హెస్సా స్ట్రీట్‌లో భారీగా ట్రాఫిక్ జామ్..!!
- February 21, 2025
యూఏఈ: దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచులు ప్రారంభం అయ్యాయి.దీని కారణంగా ఎమిరేట్‌లోని రెండు ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు గంటలకొద్ది ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బంధులు ఎదుర్కొన్నారు.
షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్.హెస్సా స్ట్రీట్ రెండింటిలోనూ ఫిబ్రవరి 20న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, రాత్రి 9 నుండి 11 గంటల వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వెల్లడించింది.వాహనదారులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని,ఈవెంట్ సమయంలో సాఫీగా వెళ్లేందుకు ముందుగానే బయలుదేరాలని అధికార యంత్రాంగం సూచించింది.
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఇండియా మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడానికి దుబాయ్‌ని తటస్థ వేదికగా నిర్ధారించిన విషయం తెలిసిందే.దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 20న ఇండియా vs బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న ఇండియా vs పాకిస్తాన్, మార్చి 2న ఇండియా vs న్యూజిలాండ్ జరుగనున్నాయి.మార్చి 4న తొలి సెమీఫైనల్‌కు, భారత్ పెద్ద మ్యాచ్‌కు అర్హత సాధిస్తే మార్చి 9న ఫైనల్‌కు దుబాయ్ ఆతిథ్యం ఇవ్వనుంది.టైటిల్ డిసైడర్‌కు భారత్ అర్హత సాధించకపోతే, లాహోర్ రెండో సెమీఫైనల్ మరియు ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుంది.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు విమాన ఛార్జీలు పెరిగాయి. ప్రయాణ నిపుణులు బుకింగ్‌లు, విమాన ఛార్జీలు 20-50 శాతం మధ్య పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. చివరి నిమిషంలో ఛార్జీలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- BKS-DC ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- 4 రోజులపాటు అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ క్లోజ్..!!
- 2026 లో రియాద్ లో కొత్త మెట్రో ట్రాక్..!!
- భారత్ కు మూడు రెట్లు డబ్బు పంపుతున్న యూఏఈ నివాసితులు..!!
- వాణిజ్య, పెట్టుబడుల విస్తరణ పై ఒమన్, భారత్ చర్చలు..!!
- ఖతార్ వర్క్‌ఫోర్స్ కోసం ఖతార్, ILO ఒప్పందం..!!
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి







