DXB సమీపంలో తాత్కాలిక బస్సు రూట్లలో మార్పులు..!!
- February 23, 2025
దుబాయ్: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (DXB) చుట్టూ అభివృద్ధి పనుల కారణంగా అనేక పబ్లిక్ బస్సు రూట్లలో తాత్కాలిక మళ్లింపులను రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ఫిబ్రవరి 21 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పులు తదుపరి నోటీసు వచ్చే వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు. ఇకపై బస్సులు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 అరైవల్ ఏరియాలోకి ప్రవేశించవని, ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలనికోరారు.
ప్రభావితమైన బస్సు మార్గాలు:
రూట్ 24: అల్ నహ్దా స్టేషన్ వైపు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 అరైవల్ బస్ స్టాప్‌కు సర్వీస్ రద్దు చేశారు. తాత్కాలిక బస్ స్టాప్, నెం. 544501, ప్రత్యామ్నాయంగా జోడించారు.
రూట్ 32C: అల్ సత్వా స్టేషన్ వైపు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 అరైవల్ బస్ స్టాప్‌కు సర్వీస్ రద్దు చేశారు.
రూట్ C01: అల్ సత్వా స్టేషన్ వైపు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 అరైవల్ బస్ స్టాప్‌కు సర్వీస్ రద్దు చేశారు.
రూట్ 33: అల్ కరామా స్టేషన్ వైపు ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 అరైవల్ బస్ స్టాప్‌కు సర్వీస్ రద్దు చేశారు. ఎమిరేట్స్ మెట్రో స్టేషన్ బస్ స్టాప్ 1 (235001) వద్ద తాత్కాలిక ప్రత్యామ్నాయ స్టాప్ జోడించారు.
రూట్ 77: ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 బస్ స్టాప్‌లు రెండు దిశలలో రద్దు చేశారు.
రూట్ N30: ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 అరైవల్ బస్ స్టాప్ రెండు దిశలలో రద్దు చేశారు. ఇంటర్నేషనల్ సిటీ బస్ స్టేషన్ వైపు ప్రయాణీకులు ప్రత్యామ్నాయ స్టాప్‌గా ఎయిర్పోర్ట్ టెర్మినల్ 1 ఎక్స్టర్నల్ పార్కింగ్‌ని ఉపయోగించవచ్చు.
టెర్మినల్ 1 రాకపోకలకు ప్రయాణించే ప్రయాణీకులు ప్రభావితమైన బస్సు మార్గాలను తనిఖీ చేసి, సులభతరమైన ప్రయాణం కోసం దుబాయ్ మెట్రో లేదా ఎమిరేట్స్ మెట్రో స్టేషన్ బస్ స్టాప్ 1ని ఉపయోగించాలని సూచించారు. ప్రయాణీకులు తమ ప్రయాణాలను సమయానికి ముందే ప్లాన్ చేసుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







