తప్పిపోయిన 9 రోజుల తర్వాత గుర్తింపు.. కుటుంబం చెంతకు ప్రవాసుడు..!!

- February 25, 2025 , by Maagulf
తప్పిపోయిన 9 రోజుల తర్వాత గుర్తింపు.. కుటుంబం చెంతకు ప్రవాసుడు..!!

యూఏఈ: ఫిబ్రవరి 15 సాయంత్రం అజ్మాన్‌లోని తన ఇంటి నుండి తప్పిపోయిన తొమ్మిది రోజుల తర్వాత 24 ఏళ్ల బంగ్లాదేశ్ ప్రవాసుడిని దుబాయ్‌లో గుర్తించారు.  ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటల సమయంలో సౌద్‌ని గుర్తించిన అజ్మాన్ పోలీసులు అతని ఆచూకీ గురించి యువకుడి కుటుంబానికి తెలియజేసి సురక్షితంగా అతడి కుటుంబానికి అప్పగించారు. అతడిని గుర్తించడంలో సహాయం చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న నివాసితులు కలిసి వచ్చారు. తప్పిపోయిన బాలుడు దుబాయ్‌లోని మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ సమీపంలో గుర్తించినట్లు పోలీసులకు సమాచారం అందించారు. ప్రజలు చేసిన సహాయానికి అతడి తల్లి ధన్యవాదాలు తెలియజేసింది. తన భర్త ఏడేళ్ల క్రితం బంగ్లాదేశ్‌కు వెళ్లినప్పటి నుండి ఒంటరిగా ఆరుగురి పిల్లలతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఆర్థికంగా కష్టపడుతున్నట్టు తెలిపారు.

మెడికల్ నివేదికల ప్రకారం.. తప్పిపోయిన యువకుడు పారానోయిడ్ స్కిజోఫ్రెనియా జబ్బుతో బాధపడుతున్నాడు. అతను అల్ అవీర్‌లోని అమల్ సైకియాట్రిక్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com