దుబాయ్, షార్జా, అబుదాబి ప్రాంతాల్లో వర్షాలు..హెచ్చరిక జారీ..!!
- February 25, 2025
యూఏఈ: ఉష్ణోగ్రతలలో గణనీయమైన తగ్గుదలతో కొన్ని ప్రాంతాలలో వర్షపాతం ఉంటుందని అంచనా జాతీయ వాతావరణ కేంద్రం అలెర్ట్ జారీ చేసింది. దుబాయ్‌లోని అల్ మక్తూమ్ రోడ్‌తో పాటు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, అబుదాబి, రస్ అల్ ఖైమా, ఫుజైరా ప్రాంతాలలో ఉదయం వర్షం కురిసిందని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుఫాన్లు వచ్చే అవకాశం ఉందని ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను NCM జారీ చేసింది. 55 కి.మీ/గం వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు.
షేక్ ఖలీఫా ఇంటర్నేషనల్ రోడ్‌లో అల్ హమ్రా నుండి మహ్మియ్యత్ అల్ సుఖూర్ (అల్ దఫ్రా రీజియన్) వైపు 2,000 మీటర్ల కంటే తక్కువ దూరం వరకు ధూళితోకూడిన గాలులు వీచే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఈ సందర్భంగానివాసితుల కోసం భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది. ఇవి:
-వాహనదారులు సురక్షితంగా నడపాలని, భద్రతా నియమాలను పాటించాలన్నారు.
-భవనాల్లోకి దుమ్ము చేరకుండా అన్ని తలుపులు, కిటికీలను ఎల్లప్పుడు మూసి ఉంచాలని సూచించారు.
-అధికార వర్గాలు జారీ చేసే సూచనలను పాటించాలని కోరారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







