నకిలీ పాస్‌పోర్ట్ స్టాంపుల కేసు..మార్చి 2కు తీర్పు వాయిదా..!!
- February 25, 2025
మనామా: 2016లో సముద్రం ద్వారా బహ్రెయిన్ నుండి పారిపోయిన వ్యక్తి సంవత్సరాల తర్వాత విమానాశ్రయం ద్వారా నకిలీ రెన్యూవల్ స్టాంపులు కలిగి ఉన్న పాస్‌పోర్ట్‌తో తిరిగి వచ్చాడు. ఇమ్మిగ్రేషన్ అధికారి అతడిని గుర్తించడంతో అదుపులోకి తసుకున్నారు. ఇప్పుడు అతడి కేసుపై హై క్రిమినల్ కోర్ట్ లో విచారణ జరుగుతుంది. డిఫెన్స్ పిటిషన్‌పై విచారణను మార్చి 2వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
నిందితుడు ఇరాన్‌కు వెళ్లి అక్రమంగా ఉంటున్నాడని, దొంగ పాస్ పోర్టుతో తిరిగి వచ్చేందుకు ప్రయత్నించాడని అనేక ఆరోపణలపై ఎదుర్కొంటున్నాడు. అయితే, అతను బహ్రెయిన్‌కు తిరిగి వచ్చినప్పుడు, అతను ఇమ్మిగ్రేషన్ వద్ద అతడిన పాస్‌పోర్ట్‌ను సమర్పించగా అందులో స్టాంపులు అనుమానస్పదంగా ఉండటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని ఒక అధికారి, సాధారణ తనిఖీలు చేస్తున్నప్పుడు, సిస్టమ్ ఇప్పటికీ వ్యక్తి దేశంలోనే ఉన్నట్లు చూపడాన్ని గమనించాడు. తదుపరి పరిశీలనలో అతడు వాంటెడ్ వ్యక్తి అని తేలింది. సముద్ర మార్గంలో పారిపోయినట్లు అంగీకరించాడు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







