తెలుగు తప్పనిసరని ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- February 25, 2025
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై రాష్ట్రంలోని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
9వ తరగతి విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి, 10వ తరగతి విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని విద్యాశాఖకు సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







