'8 వసంతాలు' ఫస్ట్ సింగిల్ అందమా అందమా మార్చి 3న రిలీజ్
- February 25, 2025మోస్ట్ సక్సెస్ ఫుల్ పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ బిగ్ స్టార్లతో హై-బడ్జెట్ ఎంటర్టైనర్లను నిర్మించడమే కాకుండా కంటెంట్-రిచ్ మూవీలను రూపొందిస్తోంది. ఇంటర్నేషనల్ అవార్డులు గెలుచుకుని విమర్శకుల ప్రశంసలు పొంది ‘మను’తో దర్శకుడిగా డెబ్యు చేసి దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ‘8 వసంతాలు’ను నిర్మిస్తున్నారు. MAD ఫేమ్ అనంతిక సనీల్‌కుమార్ ఈ మూవీలో హీరోయన్. ఇందులో ఆమె శుద్ధి అయోధ్య పాత్రలో కనిపించనుంది.ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్, టీజర్ ఇప్పటికే మంచి క్రియేట్ చేసింది.
మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ అందమా అందమా మార్చి 3న విడుదల కానుంది. స్టార్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ పాట కోసం బ్లాక్ బస్టర్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. వనమాలి రాసిన ఈ పాటని హేషమ్ అబ్దుల్ వహాబ్ ఆవని మల్హర్ పాడారు. సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లీడ్ పెయిర్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన 8 వసంతాలు హార్ట్ వార్మింగ్ మూవీగా రూపొందుతోంది. ఈ చిత్రానికి అరవింద్ మూలే ప్రొడక్షన్ డిజైనర్‌గా, శశాంక్ మాలి ఎడిటర్‌గా, బాబాసాయి కుమార్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. మేకర్స్ త్వరలో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు.
నటీనటులు: అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డి, రవితేజ దుగ్గిరాల, సంజన, కన్నా, స్వరాజ్ రెబ్బాప్రగడ, సమీరా కిషోర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ఫణీంద్ర నర్సెట్టి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సిఈవో: చెర్రీ
సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్
డీఓపీ: విశ్వనాథ్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: అరవింద్ మ్యూల్
ఎడిటర్: శశాంక్ మాలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబాసాయి కుమార్ మామిడిపల్లి
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్‌లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్‌లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







