జై ఆంధ్రా అన్న కవిత అక్క
- July 03, 2016
కేసీఆర్ తనయురాలు, ఎంపీ కవిత జై ఆంధ్రా అని నినదించడమేంటని విస్తుపోతున్నారా, లేక ఇది నిజమా? అని అనుమానిస్తున్నారా. ఇది నిజంగా నిజమేనండి బాబోయ్. స్వయానా కవితగారే ఈ మాట అన్నారు. కాకపోతే అది తెలుగు నేలపై కాదనుకోండి. చికాగోలో నిర్వహిచిన తానా వేడుకల్లో టీఆర్ఎస్ ఎంపీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్ఐలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువారంతా కలిసుండాలని కోరుకుంటున్నామని చెప్పారు. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అతితక్కువ కాలంలో అనుమతులు ఇస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత, జై తెలంగాణ.. జై ఆంధ్రా నినాదాలతో తన ప్రసంగాన్ని ముగించారు. రాష్ట్రం ఏర్పాటు అనంతరం కూడా ఆంధ్రా నేతలు తెలంగాణకు అడ్డుపడుతున్నారు అంటూ ఇప్పటికీ ఆంధ్రా వాళ్ల వెంటపడుతున్న టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు చేసిన వ్యాఖ్యాలపై ఎలా స్పందిస్తారో చూడాలి మరి!
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







