ఏడాదికి రెండు సార్లు CBSE టెన్త్ పరీక్షలు..
- February 26, 2025
న్యూ ఢిల్లీ: కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (CBSE)లో పదో తరగతి విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి బోర్డు పరీక్షలను ఒక ఏడాదిలో రెండుసార్లు రాసే ఛాన్స్ రానుంది. తొలి దశ పరీక్షలు ఫిబ్రవరిలో నిర్వహించి, రెండో దశ పరీక్షలను మేలో నిర్వహిస్తారు.
ఈ మేరకు సీబీఎస్‌ఈ ముసాయిదాకు ఆమోద ముద్ర వేసింది. పబ్లిక్ నోటీస్‌ను కూడా సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసింది. దీని పై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోంది. వచ్చేనెల 9 వరకు ప్రజలు ఫీడ్‌బ్యాక్ ఇవ్వవచ్చు. అనంతరం దానికి సీబీఎస్‌ఈ ఆమోదం తెలుపుతుంది.
- విద్యార్థులు తమ ఇష్టం మేరకు రెండు దశల్లోనూ పరీక్షలు రాయొచ్చు
- తొలిసారి రాసిన ఎగ్జామ్స్‌లో ఎక్కువ మార్కులు సాధించిన సబ్జెక్టులను రెండో దశ పరీక్షల సమయంలో రాయొద్దని భావిస్తే వాటిని పక్కనపెటొచ్చు
- తొలి దశ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి మార్చి వరకు ఉంటాయి
- రెండో దశ పరీక్షలు మే 5 నుంచి 20 వరకు జరుగుతాయి
- రెండు దశల ఎగ్జామ్స్‌లో పాఠ్యాంశాలు అన్నింటినీ పరిగణనలో ఉంటాయి
- స్టూడెంట్స్‌కు రెండు దశలకూ ఎగ్జామ్ సెంటర్ ఒకటే ఉంటుంది
- 2026లో జరిగే ఎగ్జామ్స్‌ను రాసే స్టూడెంట్స్ లిస్టును 2025 సెప్టెంబరులో ఫైనల్ చేస్తారు
- తొలి దశ ఎగ్జామ్స్‌లో ఏదైనా సబ్జెక్టు రాయలేదంటే దాని స్థానంలో మరో సబ్జెక్టును ఎంచుకునేందుకు ఛాన్స్ ఉంటుంది
- మేలో ఎగ్జామ్స్ పూర్తయిన అనంతరం మార్కుల ఫైనల్ లిస్టును ఇస్తారు
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!