ఇరాక్ లో ఘోరం, 165 మంది మృతి
- July 03, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇరాక్ లో నరమేధం సృష్టించారు. శనివారం అర్థరాత్రి సమయంలో రాజధాని బాగ్దాద్ లో వరుస బాంబు పేలుళ్లతో రాక్షసకాండ సాగించారు. షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ముష్కర మూక బాంబు దాడులకు తెగబడింది. రద్దీగా ఉన్న వాణిజ్య సముదాయాలను లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడుల్లో 165 మంది మృతి చెందగా.. 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య 125గా బీబీసీ పేర్కొంది. ఎంత మంది మృతి చెందారనేది ఇరాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు.రంజాన్ మాసం సందర్భంగా షాపింగ్ మాల్స్ ప్రాంతాలు రద్దీగా ఉండటంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్రాడ ప్రాంతంలో జరిగిన మొదటి దాడిలో ఉగ్రవాదులు రిఫ్రిజిరేటర్లు, కారులో పేలుడు పదార్దాలను నింపి పేల్చివేశారు. ఈ ఘటనలో వంద మందిపైగా మందికి పైగా మృతి చెందారు. భారీ పేలుడు దాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎటుచూసినా మృతదేహాలతో ఈ ప్రాంతమంతా భీతావహంగా మారింది. అల్ షాబ్ ప్రాంతంలోని మార్కెట్ వద్ద జరిగిన కారుబాంబు దాడిలో ఐదుగురు మృతి చెందారు. 16 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు ప్రకటించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన ప్రధాని హైదర్ అల్-అబాదిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నుంచి ఫాజుల్లా నగరాన్ని ఇరాక్ బలగాలు స్వాధీనం చేసుకున్నందుకు ప్రతీకారంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







