షార్జాలో రమదాన్ 2025: 10 ఇఫ్తార్ ఫిరంగి ప్లేసేస్ ఇవే..!!
- February 28, 2025
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్ ఫిరంగిని ప్రయోగించేందుకు షార్జా పోలీసులు 10 ప్రదేశాలను గుర్తించారు. ఫిరంగులు అల్ మజాజ్ వాటర్ ఫ్రంట్, మువైలిహ్ సబర్బ్ కౌన్సిల్, అల్ సియుహ్ సబర్బ్ కౌన్సిల్, అల్ రహ్మానియా సబర్బ్ కౌన్సిల్, అల్ హమ్రియా సబర్బ్ కౌన్సిల్లో ఉన్నాయి.
అల్ మదామ్ నగరంలోని తవిలా పరిసరాల్లోని అల్ దైద్ ఫోర్ట్ , అల్ నయీమ్ మసీదు.. తూర్పు ప్రాంతంలో క్లాక్ టవర్,అల్ హఫియా లేక్, కల్బా నగరం, ఖోర్ఫక్కన్ యాంఫీథియేటర్, దిబ్బా అల్ హిస్న్ నగరంలోని ఫ్లాగ్‌పోల్ ప్రాంతాలను నిర్ణయించారు.
చరిత్రకారుల ప్రకారం.. 10వ శతాబ్దపు ఈజిప్టులో ఫిరంగులను పేల్చే ఆచారం ప్రారంభమైంది. ఇది ఇఫ్తార్ సమయం అని ప్రజలకు తెలియజేయడానికి వాటిని పేల్చే వారు. నెలవంక వీక్షణపై ఆధారపడి, రమదాన్ మార్చి 1న ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 28న సాయంత్రం రమదాన్ కోసం నెలవంకను చూడాలని ముస్లింలందరికీ యూఏఈ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!







