జూలై 4,5,6 తేదీల్లో NATS అమెరికా తెలుగు సంబరాలు

- March 01, 2025 , by Maagulf
జూలై 4,5,6 తేదీల్లో NATS అమెరికా తెలుగు సంబరాలు

అమెరికా: అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగ వైభవంగా నిర్వహించే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలను ఈ సారి టంపా వేదికగా జూలై 4,5,6 తేదీల్లో టంపా వేదికగా నిర్వహిస్తున్నట్టు నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ ఒక ప్రకటనలో తెలిపారు.ఫ్లోరిడా రాష్ట్రం టంపాలోని టంపా కన్వెన్షన్‌ సెంటరు వేదికగా జరగనున్న ఈ తెలుగు సంబరాలలో తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా నలుమూలల నుండి పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని, తెలుగు వారి సాంస్కృతిక వైభవానికి పట్టం కట్టేలా కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నామని శ్రీనివాస్ అన్నారు.ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇప్పటికే ఏడు సార్లు ప్రతి రెండేళ్లకు అమెరికా సంబరాలను అద్భుతంగా నిర్వహించిందని.. ఈ సారి 8వ అమెరికా తెలుగు సంబరాలను కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తుందని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని పేర్కొన్నారు. అమెరికాలో ఉండే తెలుగు వారంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి పిలుపునిచ్చారు.తెలుగు వారిని అలరించే ఎన్నో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోదాల సమాహారాలు ఈ సంబరాల్లో ఉంటాయని నాట్స్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.సంబరాల నిర్వహణ కమిటీలను ఎంపిక చేశామని, 3లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం కలిగిన టంపా కన్వెన్షన్‌ సెంటరులో ఈ సంబరాల నిర్వహణ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని నాట్స్‌ పేర్కొంది.రోజుకి 10 వేలకు పైగా ప్రవాస అతిథులు ఈ వేడుకల్లో  పాల్గొంటారనే అంచనాలతో నాట్స్‌ 8వ అమెరికా తెలుగు సంబరాల కోసం ఆ స్థాయిలో విజయవంతానికి  నాట్స్ సంబరాల కమిటీ ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com