అన్ని షోలకి పిల్లలను అనుమతించాలి:తెలంగాణ హైకోర్టు
- March 01, 2025
తెలంగాణ: తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెల్లడించింది. తెలంగాణలోని ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతి లేదని హైకోర్టు మరోసారి తెలిపింది. జనవరి 21న ఇచ్చిన ఉత్తర్వులను నేడు సవరించిన హైకోర్టు ప్రీమియర్, బెనిఫిట్ షోలకు అనుమతిని నిరాకరించింది.అలాగే ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. మరోవైపు 16 ఏండ్ల లోపు పిల్లలను అన్ని షోలకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మల్టీప్లెక్స్ థియేటర్లకు హైకోర్టు తాజా తీర్పుతో పెద్ద ఊరట లభించింది. 16 ఏళ్ల లోపు పిల్లలను అన్ని షోలకు అనుమతించాలంటూ హైకోర్టు సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జనవరి 21న కోర్టు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏళ్ల లోపు పిల్లలు థియేటర్లకు రాకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే, తాజాగా హైకోర్టు తన పూర్వపు నిర్ణయాన్ని సవరించింది.
హైకోర్టు తీర్పు
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు 16 ఏళ్ల లోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ విషయమై అన్ని వర్గాలతో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
ప్రత్యేక షోలు
సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం .అర్థరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 వరకు గల మధ్య సమయంలో ఎలాంటి ప్రత్యేక షోలకు అనుమతి లేదని.ఈ చట్టాన్ని పాటించాలని న్యాయస్థానం గత నెల ప్రభుత్వాన్ని ఆదేశించింది. పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన తర్వాత ప్రభుత్వం అప్రమత్తమైంది. హైకోర్టు ఆదేశాలు అలాగే ప్రభుత్వ నిర్ణయం ద్వారా బెనిఫిట్ మరియు ప్రీమియర్ షోలపై నిషేధం విధించింది. ఈ ఆంక్షల వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశాయి.పిల్లల ప్రవేశంపై ఉన్న ఆంక్షల కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.ఈ ఆంక్షలను ఎత్తివేయాలని కోర్టును కోరారు.
తాజా తీర్పు
6 ఏళ్ల లోపు పిల్లలను అన్ని షోలకు అనుమతించాలంటూ గత ఉత్తర్వులను సవరించింది.అయితే బెనిఫిట్, ప్రీమియర్, స్పెషల్ షోలకు అనుమతి నిరాకరించింది.ఈ కేసుపై తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేసింది.ఈ తీర్పుతో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు, సినీ రంగానికి కొంత ఊరట లభించినట్లు చెప్పవచ్చు. చిన్న పిల్లలు కూడా ఏ షోకైనా వెళ్లేందుకు అనుమతి లభించడంతో థియేటర్లకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







