కోజికోడ్ జిల్లా ప్రవాసీ ఫోరమ్ ఆధ్వర్యంలో బహ్రెయిన్ లో మెగా మెడికల్ క్యాంప్..!!

- March 02, 2025 , by Maagulf
కోజికోడ్ జిల్లా ప్రవాసీ ఫోరమ్ ఆధ్వర్యంలో బహ్రెయిన్ లో మెగా మెడికల్ క్యాంప్..!!

మనామా: కోజికోడ్ జిల్లా ప్రవాసీ ఫోరమ్ (KPF) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 28న ఉమ్ అల్ హస్మ్‌లో మెగా వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు జరిగిన ఈ ఈవెంట్‌కు విశేషమైన స్పందన లభించింది. 400 మందికి పైగా వ్యక్తులు ప్రయోజనం పొందారు.డా.అమర్‌జిత్ కౌర్ సంధు వైద్య శిబిరాన్ని అధికారికంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి KPF అధ్యక్షుడు సుధీర్ తిరునిలత్ అధ్యక్షత వహించగా, ప్రధాన కార్యదర్శి అరుణ్ ప్రకాష్ పర్యవేక్షించారు.ఈ శిబిరం సందర్భంగా నూతనంగా నమోదైన కేపీఎఫ్ సభ్యులకు సభ్యత్వ కార్డులను పంపిణీ చేశారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్ డైరెక్టర్ మాధురి ప్రకాష్, మెంబర్‌షిప్ వింగ్ కన్వీనర్ మిథున్ నాదపురం మొదటి సెట్ కార్డ్‌లను అందించారు. మెగా వైద్య శిబిరం సమాజానికి సేవ చేయడంలో.. ముఖ్యంగా ప్రవాసులలో ఆరోగ్య అవగాహనను పెంపొందించడంలో విశేష కృషి చేస్తోందని వక్తలు అభినందించారు.  

KPF అనేది కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఒక లాభాపేక్షలేని సంస్థ. వివిధ కార్యక్రమాల ద్వారా ఐక్యతను పెంపొందించడం, సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com