Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- November 07, 2025
యూఏఈః యూఏఈ లాటరీలో Dh100 మిలియన్ల విజేతగా నిలిచిన అబుదాబి నివాసి, 9 ఏళ్ల ఈ భారతీయ ఐటీ ప్రొఫెషనల్ అనిల్‌కుమార్ బొల్లా తన భవిష్యత్ ప్లాన్ ను వెల్లడించాడు. వచ్చే దశాబ్దం పాటు యూఏఈని తన ఇంటిగా మార్చుకోవాలని యోచిస్తున్నాడట. ఇండియాలోని తెలంగాణకు చెందిన అనిల్‌కుమార్ దాదాపు ఏడాదిన్నర క్రితం అబుదాబికి వచ్చారు. అప్పటి నుండి IT రంగంలో పనిచేస్తున్నారు. త్వరలోనే తన కుటుంబాన్నియూఏఈ తీసుకురానున్నట్లు తెలిపాడు.వారంతా యూఏఈలో తనతోపాటే ఉండేలా ప్దెద ఇళ్లు కొనేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించాడు.
అక్టోబర్ 18న ఇంట్లో ఉండగా లాటరీ టీమ్ నుండి ఊహించని కాల్ వచ్చిందని, అది తన జీవితాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు. యూఏఈ చరిత్రలో అతిపెద్ద Dh100 మిలియన్ల జాక్‌పాట్ గెలిచానని ప్రకటించగానే షాక్ కు గురైనట్లు తెలిపాడు.
లాటరీలో వచ్చిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టే ముందు అతను ప్రొఫెషనల్ ఆర్థిక సలహా తీసుకోవాలని యోచిస్తున్నట్టు తెలిపాడు. రియల్ ఎస్టేట్‌లో మరియు స్టాక్ మార్కెట్‌లో కూడా పెట్టుబడి పెట్టాలని ప్లాన్స్ ఉన్నాయని పేర్కొన్నాడు. అలాగే, తన సహోద్యోగితో కలిసి IT కన్సల్టెన్సీ వ్యాపారాన్ని ప్రారంభించడం గురించి కూడా ఆలోచిస్తున్నట్లు వివరించాడు. తనకు సూపర్‌కార్ కొనాలనే కల ఉందని, ఖచ్చితంగా కొంటానని తెలిపాడు. అదే విధంగా తాను గెలిచిన డబ్బులో కొంత భాగాన్ని దాతృత్వానికి విరాళంగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు అనిల్‌కుమార్ తెలిపారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







