ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- November 07, 2025
దోహా: ఖతార్‌లో రెంటల్ సెక్టర్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో రెంటల్ డిమాండ్ పెరిగింది. ఈ త్రైమాసికంలో 27,240 రెంటల్ కాంట్రాక్టులు నమోదయ్యాయి. ఇది గత సంవత్సరం మూడవ త్రైమాసికంతో పోలిస్తే 7.4 శాతం పెరుగుదల అని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ డేటా తెలిపింది. దీనితో ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో మొత్తం కాంట్రాక్టుల సంఖ్య 89,341కి చేరుకుంది. ఇది సంవత్సరానికి 25.1 శాతం పెరుగుదల అని తెలిపింది. మొత్తం కాంట్రాక్టులలో 76 శాతం (68,607 కాంట్రాక్టులు) నివాస ఒప్పందాలు కాగా, వాణిజ్య ఒప్పందాలు 18,733గా ఉన్నాయి.
ఖతార్ నేషనల్ విజన్ 2030కి అనుగుణంగా ఖతార్ రియల్ ఎస్టేట్ సెక్టర్ వృద్ధిని నమోదు చేస్తుందని అథారిటీ తెలిపింది. ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో QR4.493 బిలియన్ల విలువైన 1,256 రియల్ ఎస్టేట్ లావాదేవీలను నమోదు చేయడంతో ఖతార్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసిందని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ డేటా తెలిపింది.
తాజా వార్తలు
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దు..
- మూడు దశాబ్దాలకు పైగా ప్రవాసాంధ్రులకు సేవలు.. ఉద్యోగ విరమణ చేసిన జాన్ సుందర్ శీలా
- అబుదాబిలో దీపావళి వేడుకల్లో పాల్గొన్న షేక్ నహ్యాన్ బిన్ ముబారక్..
- ఖతార్‌లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..
- హజ్ 2027కు భారత్‌కు 1,75,025 మంది యాత్రికుల కోటా..
- దుబాయ్‌లో మరో కీలక పెడెస్ట్రియన్ బ్రిడ్జి..
- ఇరాన్‌కు ఆయుధాల సరఫరాను అడ్డుకోవడమే అమెరికా వ్యూహం!
- ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత
- లడఖ్‌లో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ







