తిరుమలను నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ చైర్మన్‌ లేఖ

- March 02, 2025 , by Maagulf
తిరుమలను నో ఫ్లయింగ్‌ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ చైర్మన్‌ లేఖ

తిరుమల: తిరుమల పుణ్యక్షేత్రం పై విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు లేఖ రాశారు.

ఈ సందర్భంగా ఆగమశాస్త్ర నిబుధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు.

తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యాకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని తెలియజేశారు.

తిరుమల పవిత్రత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి తిరుమల క్షేత్ర గంగనతలాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం ముఖ్యమైన అడుగని తెలిపారు.

తక్షణం ఈ విషయం పై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రిని టీటీడీ చైర్మన్ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com