ఫీజు చెల్లించకపోతే విద్యార్థులను పరీక్షలు రాయనియ్యరా?

- March 02, 2025 , by Maagulf
ఫీజు చెల్లించకపోతే విద్యార్థులను పరీక్షలు రాయనియ్యరా?

దుబాయ్: ఒక నెల లేదా రెండు నెలల పాటు స్కూల్ ఫీజు చెల్లించలేకపోతే ఏమి జరుగుతుంది? విద్యార్థులను పరీక్షలు రాయకుండా అడ్డుకునే హక్కు ఉంటుందా?  వరుసగా రెండు మూడు నెలలపాటు ఫీజు చెల్లించనందుకు పాఠశాల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అందువల్ల, వీలైతే,పాఠశాల ఫీజు చెల్లించడానికి ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ఇది విద్యార్థుల విద్యా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని నిపుణులు తెలిపారు.  

పాఠశాల ఫీజు చెల్లించడంలో విఫలమైతే, యూఏఈలోని చట్టాల ప్రకారం.. తల్లిదండ్రులు/చట్టపరమైన సంరక్షకులు కాబట్టి వారిపై సివిల్ కేసును ఫైల్ చేసే అవకాశం పాఠశాలకు ఉంది. ఏదైనా వివాదాన్ని పరిష్కరించడంలో పాఠశాలలు,  తల్లిదండ్రులకు సహాయం చేయడం KHDA పాత్ర కాబట్టి మీ ఎంపికలను బాగా అర్థం చేసుకోవడానికి మీరు దుబాయ్‌లోని నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KHDA) నుండి మరింత గైడ్ లైన్స్ పొందవచ్చు. "KHDA నుండి అనుమతి లేకుండా విద్యార్థులను సస్పెండ్ చేయడానికి లేదా బహిష్కరించడానికి పాఠశాలలకు అనుమతి లేదు." అని అధికార యంత్రాంగం తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com