మానవ అక్రమ రవాణాకు చెక్..ముసాయిదా చట్టంపై స్టేట్ కౌన్సిల్ చర్చ..!!

- March 04, 2025 , by Maagulf
మానవ అక్రమ రవాణాకు చెక్..ముసాయిదా చట్టంపై స్టేట్ కౌన్సిల్ చర్చ..!!

మస్కట్: స్టేట్ కౌన్సిల్ లీగల్ కమిటీ మంత్రుల మండలి రిఫర్ చేసిన 'మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడం'పై ముసాయిదా చట్టంపై చర్చించింది.

సెక్రటేరియట్ జనరల్ సభ్యులు సమక్షంలో.. లీగల్ కమిటీ చైర్మన్ షేక్ సుల్తాన్ బిన్ మత్తర్ అల్ అజీజీ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో.. కమిటీ మానవ హక్కులకు మద్దతు ఇవ్వడంలో సుల్తానేట్ పాత్ర, ఒమానీ సమాజంలోని అన్ని రంగాలలో విలువలను పెంచే లక్ష్యంతో దాని సూత్రాలలో భాగమైన ముసాయిదా చట్టంపై మజ్లిస్ అల్ షురా నివేదికను సమీక్షించారు. 

మానవ అక్రమ రవాణాను ఎదుర్కోవడంపై ముసాయిదా చట్టం ఈ రంగంలో తాజా పరిణామాలను, అటువంటి నేరాలను ఎదుర్కోవడంలో ప్రాంతీయ, అంతర్జాతీయ అనుభవాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com