ఫేస్ బుక్ లో పోస్ట్ చేయకూడనివి...
- July 04, 2016
సామాజిక అనుసంధాన వేదిక ఫేస్ బుక్ లో ఏవి పడితే అవి పోస్ట్ చేయకూడదని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. అవి పోస్ట్ చేసిన వాళ్లకు ఇబ్బందులు తీసుకొస్తాయంట. అలా పోస్ట్ చేయకూడని కొన్ని అంశాల గురించి వారు ప్రత్యేకంగా చెప్పారు. అవేమిటో ఒకసారి పరిశీలిస్తే..బ్యాంక్ వివరాలు.. డబ్బు పంపించేందుకు బ్యాంకు ఖాతా వివరాలు అవసరం ఉంటుంది. కొంతమంది విద్యార్థులు ఈ మధ్య ఆ వివరాలను ఫేస్ బుక్ లో చాటింగ్ సమయాల్లో పోస్ట్ చేస్తున్నారంట. అలాంటి తప్పు ఎప్పుడూ చేయొద్దని వారు ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు.విన్నింగ్ టికెట్స్ ఆస్ట్రేలియాలో ఓ మహిళ తను గెలిచిన లాటరీ టికెట్ అని సంతోషాన్ని ఆపుకోలేక ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. పెద్ద ఎత్తున పార్టీ కూడా చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు ఆ టికెట్ ను కొందరు వ్యక్తులు మార్ఫింగ్ చేసి ఆమెకు తెలిసిన వారిలో కొందరు ఆ నగదు కొట్టేశారు. ఇంటి చిరునామా కొంతమంది ఇంటి చిరునామాను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నారంట. దీనివల్ల దొంగలకు తలుపులు బార్లా తెరిచినట్లే అవుతుందని అలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.పాస్ పోర్ట్ కూడా.. చాలామంది వ్యక్తులు తమ పాస్ట్ పోర్టు నెంబర్ కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తున్నారని ఇది చాలా డేంజర్ అని అంటున్నారు.పిల్లల వివరాలు, ఫొటోలు చిన్నారుల వివరాలను కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం అంతమంచిది కాదని అంటున్నారు. పిల్లల ఫొటోలు పోస్ట్ చేసినప్పుడు వాటికి లైక్స్ రావడమేమోగానీ.. అందులో కొంతమంది నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తారంట. అది చూసి మానసికంగా కుంగిపోయే ప్రమాదం ఉందని.. అలాంటివి అస్సలు పోస్ట్ చేయకూడదని అంటున్నారు.బాస్ కు ఫిర్యాదు ఒక ఉద్యోగి తన సంస్థకు, యజమానికి సంబంధించిన ఫిర్యాదులు ఎట్టి పరిస్థితుల్లో ఫేస్ బుక్ లో పోస్ట్ చేయొద్దంట. అలా చేయడం వల్ల ఆ ఉద్యోగికి భవిష్యత్తులో కూడా సమస్యలు వస్తాయంట. అలాగే, ఫేస్ బుక్ ద్వారా ప్రైవేట్ సంభాషణ ఎప్పుడూ చేయొద్దంట.కాపీ అండ్ పేస్ట్ స్టేటస్ ఫేస్ బుక్ లో కాపీ పేస్ట్ చేయొద్దని చెప్తున్నారు. అలా చేయడం వల్ల తమ కంటెంట్ దొంగిలించారని దానికి సంబంధించిన వ్యక్తులు కేసులు పెట్టే ప్రమాదం కూడా లేకపోలేదని వారు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







