టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
- March 05, 2025
పాకిస్తాన్: న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య ఇవాళ సెకండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లాహోర్లోని గడాఫీ క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు మార్చి 9న దుబాయ్లో భారత్తో ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లు మూడోసారి తలపడనున్నాయి. మునుపటి పోరులో ఇద్దరూ 1-1 తేడాతో గెలిచారు. ఫిబ్రవరిలో జరిగిన ముక్కోణపు సిరీస్లో ఈ రెండు జట్లు చివరిసారిగా వన్డేల్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
ఇరు జట్లు:
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్, టెంబా బావుమా(కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డుసెన్, హెన్రిచ్ క్లాసెన్(కీపర్), డేవిడ్ మిల్లర్, ఐడెన్ మర్క్రామ్, వియాన్ ముల్డర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగీ న్గిడి.
న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): విల్ యంగ్, రాచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, కైల్ జామిసన్, విలియం ఓరూర్కే.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







