దుబాయ్‌లో పార్కింగ్‌ పర్యవేక్షించే కొత్త కెమెరాలు..ఎలా పనిచేస్తుందంటే..!!

- March 06, 2025 , by Maagulf
దుబాయ్‌లో పార్కింగ్‌ పర్యవేక్షించే కొత్త కెమెరాలు..ఎలా పనిచేస్తుందంటే..!!

దుబాయ్: దుబాయ్‌లోని కొన్ని ప్రాంతాలలో టిక్కెట్లు లేని, ఇబ్బంది లేని.. పూర్తిగా ఆటోమేటెడ్ పార్కింగ్ వ్యవస్థ ఇప్పుడు అమలులో ఉంది. వేచి ఉండాల్సిన అవసరం లేదు, టిక్కెట్లు లేవు. నేరుగా పార్క్ చేసి, బయటకు వెళ్లవచ్చు. సెన్సార్లు, ఆన్-గ్రౌండ్ కెమెరాలు వాహన లైసెన్స్ ప్లేట్‌ను క్యాప్చర్ చేసి, చెల్లించాల్సిన సంబంధిత పార్కింగ్ రుసుములను నిర్ణయిస్తాయి. రిక్సోస్, అనంతరా హోటళ్ల మధ్య పామ్ జుమైరా తూర్పు క్రెసెంట్‌లో అమలు చేయబడిన అధునాతన పార్కింగ్ వ్యవస్థను తాజాగా ప్రకటించారు. 2022 నుండి చెల్లింపు పార్కింగ్ అమలులో ఉంది. గతంలో నగదు రహిత పార్కింగ్ మీటర్లను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పార్కింగ్‌ను రోడ్లు, రవాణా అథారిటీ (RTA) లేదా పబ్లిక్ పార్కింగ్ ఆపరేటర్ పార్కిన్ PJSC నిర్వహించవు. కానీ ప్రైవేట్ కంపెనీ పార్కోనిక్ నిర్వహిస్తుంది.

వాహనాలు రాకపోకలు, పార్కింగ్ సమయంలో సెన్సార్లు, ఆన్-గ్రౌండ్ కెమెరాలు (సుమారు 1.5 అడుగుల పొడవు) ఆటోగా గుర్తిస్తాయి. కెమెరాలు ఆటోమేటిక్ గా ప్లేట్ నంబర్‌లను రీడ్ చేసి, సమయాన్ని నమోదు చేయడం వలన వాహనదారులు ఇకపై పార్కింగ్ మీటర్ కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. లేదా యాప్ ద్వారా లేదా SMS ద్వారా వివరాలను మాన్యువల్‌గా ఇన్‌పుట్ చేయాల్సిన అవసరం లేదు.

టిక్కెట్లు పోగొట్టుకోవడం లేదా చెల్లింపు యంత్రాల వద్ద పొడవైన క్యూలు ఉండటం వంటి సమస్య ఇక ఉండదు. 

రిక్సోస్, అనంతరా హోటళ్ల మధ్య ఉన్న పామ్ జుమైరా తూర్పు క్రెసెంట్‌లో చెల్లింపు పార్కింగ్ గంటకు 10 దిర్హామ్‌లు. పార్కింగ్ వారమంతా ప్రతిరోజూ 24 గంటలు పనిచేస్తుంది. అయితే, వెస్ట్ క్రెసెంట్‌లో పబ్లిక్ పార్కింగ్ ఇప్పటికీ ఉచితం అని తెలిపారు. పార్కోనిక్ వెబ్‌సైట్‌కి వెళ్లి లేదా QR కోడ్‌ని ఉపయోగించి ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయవచ్చు. ఈ ప్రాంతంలో ఉన్న చెల్లింపు బూత్‌లలో నగదు లేదా క్రెడిట్ కార్డ్‌తో చెల్లించే ఎంపిక కూడా ఉంది. వాహనదారులకు సహాయం చేయడానికి పార్కోనిక్ సిబ్బంది కూడా ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్నారు. విచారణల కోసం, పార్కోనిక్‌ను 800-పార్కోనిక్; (కాల్ సెంటర్) 800-72756642 వద్ద సంప్రదించవచ్చు; లేదా [email protected] కు ఇమెయిల్ పంపవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com