చెల్లించని వేతనాలు వైద్య విద్యార్థులకు చెల్లించి ఆపై ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం

- July 04, 2016 , by Maagulf
చెల్లించని వేతనాలు వైద్య విద్యార్థులకు చెల్లించి  ఆపై  ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం

మస్క్యాట్:  ఏడు నెలల కంటే ఎక్కువ కాలం జీతాలు  చెల్లించని  27 మంది  వైద్య పట్టభద్రులకు  వారి శిక్షణ పూర్తి చేసిన తరువాత వారికి  ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు ఇస్తామని ఒమాన్ ప్రభుత్వం వాగ్ధానం చేసింది.  వైద్య విద్యార్థులకు పూర్తిగా  వారి బకాయిలు చెల్లిస్తామని  ఆరోగ్య మంత్రిత్వ  శాఖ ఒక ప్రకటనలో జారీ చేసింది.  సోషల్ మీడియాలో ఈ అంశం  చాలా మందిని  ఆకర్షించింది. అనేక మంది వినియోగదారులు జీతాల కోసం  పోరాడుతున్న వైద్య విద్యార్థులకు తమ సంఘీభావం ప్రకటించడంతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ కేసు విషయమై  స్పందించారు.

                

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com