మరో స్కామ్‌కు తెరతీస్తున్న రేవంత్ ఆరోపించిన కేటీఆర్
- March 10, 2025
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ నలుగురు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని, వారి సహకారంతో డబ్బులు భారీగా సంపాదిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. టీడీఆర్ పేరిట రేవంత్ రెడ్డి భారీ కుంభ కోణానికి తెర లేపబోతున్నారని, వెంటనే దీనిమీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ సోమవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్‌ను గతంలోనే బీఆర్ఎస్ ప్రతిపాదించిందని, 2023లో అప్పుడు బీజేపీ ఆపిందన్నారు. ఆయన గతంలో బీఆర్ఎస్ను వీడకపోతే ఎప్పుడో ఎమ్మెల్సీ అయ్యేవారని అన్నారు. పట్టుబట్టి బీజేపీ ఆపిందని… ఇప్పుడు వారు ఆపినప్పటికీ దాసోజుకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చిందని మాజీ మంత్రి అన్నారు.
అధికారంలోకి వచ్చిన రోజు నుంచే…ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే అవినీతి, అక్రమ పాలనకు తెరతీశారంటూ రేవంత్ పై ఆరోపణలు గుప్పించారు. 1947 నుంచి దేశ చరిత్రలో ఇప్పటివరకు ఏ సీఎం ఇంత స్థాయిలో డబ్బులు సంపాదించడం తెలియదేమో అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ వ్యక్తుల దోపిడీ పెరిగి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందన్నారు. ఇండియా టుడే సదస్సులో రేవంత్ రెడ్డి దివాళాకోరుతనం బయట పెట్టుకున్నారని మండిపడ్డారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







