10లక్షల మంది సందర్శకులతో 'జెడ్డా హిస్టారిక్' రికార్డు..!!

- March 11, 2025 , by Maagulf
10లక్షల మంది సందర్శకులతో \'జెడ్డా హిస్టారిక్\' రికార్డు..!!

జెడ్డా: 2025 రమదాన్ సీజన్ మొదటి వారంలో జెడ్డా హిస్టారిక్ జిల్లాకు పది లక్షలకు పైగా సందర్శకులు తరలివచ్చారు. ఇది అపూర్వమైన విజయమని అధికారులు తెలిపారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జెడ్డా హిస్టారిక్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించిన రమదాన్ సీజన్, సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరణకు సంబంధించిన అత్యంత ప్రముఖ రమదాన్ కార్యక్రమాలలో ఒకటి అని పేర్కొన్నారు.

అత్యధికంగా సందర్శకులు సంస్కృతి, కళలు, సాంప్రదాయ మార్కెట్లు, వారసత్వ వంటకాలను ప్రత్యేకంగా ఆస్వాదిస్తున్నారు. మార్కెట్లలో స్థానిక ఉత్పత్తులు,  సాంప్రదాయ ఆహారాలకు అధికంగా డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఈ సీజన్ సక్సెస్ జెడ్డా హిస్టారిక్ డిస్ట్రిక్ట్‌ను ప్రముఖ ప్రపంచ సాంస్కృతిక, పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టే ప్రయత్నాలను బలోపేతం చేస్తుందన్నారు.

రమదాన్ కార్యక్రమాలు కొనసాగుతున్నందున రాబోయే వారాల్లో సందర్శకుల సంఖ్య పెరుగుతుందని, పవిత్ర మాసంలో జెడ్డా హిస్టారిక్ డిస్ట్రిక్ట్ ఒక ప్రధాన గమ్యస్థానంగా మారుతుందని భావిస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com