'భద్రకాళి' టీజర్ విడుదల
- March 12, 2025
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భద్రకాళి. అరుణ్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ విజయ్ ఆంటోనీ కెరీర్లో 25వ చిత్రం కావడం విశేషం. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.
‘పిల్లి కూడా ఒక రోజు పులి అవుతుంది.. అబద్దం, అహంకారం అంతం అవును’ అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. రాజకీయ వ్యవస్థ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రంలో హీరో పాత్ర గ్యాంగ్ స్టర్‌తో పాటు మరికొన్ని కోణాల్లో కనిపించనున్నట్లు టీజర్ ను బట్టీ తెలుస్తోంది.
ఇది వరకు ఎన్నడూ కనిపించినంత స్టైలీష్‌గా, యాక్షన్ హీరోగా విజయ్ కనిపిస్తున్నారు. ఇక టీజర్ చివరల్లో రూ.197 కోట్లా? ఇది ఆరంభమే అంటూ వచ్చిన డైలాగ్ సినిమాపై అంచాలను పెంచుతోంది.
వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీనే సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ టీమ్ భావిస్తోంది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







