బహ్రెయిన్‌లో ట్రాఫిక్ సవాళ్లపై లోతైన అధ్యయనం..!!

- March 13, 2025 , by Maagulf
బహ్రెయిన్‌లో ట్రాఫిక్ సవాళ్లపై లోతైన అధ్యయనం..!!

మనామా: రహదారి భద్రతను పెంచడానికి నిరంతర ప్రయత్నాలు అవసరమని బహ్రెయిన్ ట్రాఫిక్ కౌన్సిల్ చైర్మన్, అంతర్గత వ్యవహారాల మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా అన్నారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి వాహన సంఖ్యలు, భద్రతా ప్రమాణాలు, సంబంధిత విధానాలపై సమగ్ర అధ్యయనం అవసరమని ఆయన హైలైట్ చేశారు. ఆయన అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ కౌన్సిల్ దాని ఎజెండాలోని కీలక అంశాలను సమీక్షించారు. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఉద్దేశించిన చర్యలపై ఫోకస్ చేశారు. వాహనాల సంఖ్యలు, లైసెన్స్‌లు, ట్రాఫిక్ చట్టాలను నియంత్రించడంతోపాటు ట్రాఫిక్ నిర్వహణ, రోడ్ నెట్‌వర్క్ మెరుగుదలల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై చర్చించారు.

బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ & కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు.. రోడ్ నెట్‌వర్క్‌లను విస్తరించడానికి వివరణాత్మక వ్యూహాన్ని అభివృద్ధి చేయడానికి రూపొందించిన ప్రణాళికలపై సమీక్షించారు. అదే సమయంలో బస్సులు, స్టేషన్ల సంఖ్యను పెంచడంతో సహా ప్రజా రవాణా రంగాన్ని మెరుగుపరచడానికి జరుగుతున్న ప్రయత్నాలపై చర్చించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com