QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో SQU పురోగతి..!!

- March 13, 2025 , by Maagulf
QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో SQU పురోగతి..!!

మస్కట్: సుల్తాన్ కబూస్ విశ్వవిద్యాలయం (SQU) అకడమిక్ ప్రోగ్రామ్‌ల ద్వారా 2025 QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించింది. దాని పెట్రోలియం ఇంజనీరింగ్ స్పెషలైజేషన్‌లో ప్రపంచవ్యాప్తంగా 25వ స్థానాలు మెరుగుపడింది. అదే సమయంలో నర్సింగ్ స్పెషలైజేషన్‌లో SQU 32వ ర్యాంకింగ్‌ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్ 50 మేజర్‌లలో ఒకటిగా నిలిచింది. SQU అందించే అకౌంటింగ్, ఫైనాన్స్, విద్య, కెమికల్ ఇంజనీరింగ్, వ్యవసాయం, పర్యావరణ శాస్త్రాలు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మేజర్‌లతో టాప్ 300 గ్లోబల్ విభాగాల జాబితాలోకి స్థానం సంపాదించింది.  వీటితోపాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, ఎకనామిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, బిజినెస్ అండ్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్, మెడిసిన్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, బయాలజీ అనేక ఇతర SQU స్పెషలైజేషన్లు కూడా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో స్థానాలు సాధించాయి.  

ఉన్నత విద్య, పరిశోధనలలో ప్రపంచ స్థాయి అత్యుత్తమ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటానికి తన నిబద్ధతకు ఇది నిదర్శనమని సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. మెరుగైన ర్యాంకింగ్ సాధించడంపై హర్షం వ్యక్తం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com