'ఇండీవుడ్‌ మీడియా ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌-2016' గెలుచుకున్న 'మా గల్ఫ్‌'

అతి తక్కువ కాలంలోనే గల్ఫ్‌లోని తెలుగువారి మనసుల్ని చూరగొన్న మీడియా పోర్టల్‌ 'మాగల్ఫ్‌.కామ్‌' అరుదైన గౌరవం దక్కించుకుంది. ఇండీవుడ్‌ కార్నివాల్‌లో భాగంగా 2016 సంవత్సరానికిగాను మీడియా ఎక్స్‌లెన్స్‌ అవార్డ్‌ విభాగంలో 'మాగల్ఫ్‌.కామ్‌' గెలుచుకుంది.అది అరుదైన గౌరవంగా చెప్పుకోవాలి. ఈ అవార్డుని 'మాగల్ఫ్‌.కామ్‌' అధినేత శ్రీకాంత్ చిత్తర్వు అందుకున్నారు. ఆయనతో లో పాటు  ఆర్.వి.ఆర్ ప్రసాద్,శరత్ చంద్ర,సుందీప్, నవనీత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా 'మాగల్ఫ్‌.కామ్‌' ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతోంది.ఇండీవుడ్‌ నిర్వాహకులు, జ్యూరీ మెంబర్స్‌, అలాగే మా గల్ఫ్‌ వీక్షకులు,జర్నలిస్ట్స్,రిపోర్టర్స్‌ మరియు రచయితలకు మాగల్ఫ్‌.కామ్‌ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ కార్నివాల్‌లో 132కి పైగా సినిమాలు ప్రదర్శితమవుతున్నాయి. రామోజీ ఫిలిం సిటీ ఈ సంబరాలకు వేదికయ్యింది. 80 దేశాలకు చెందిన ప్రతినిథులు ఈ కార్నివాల్‌కి హాజరయ్యారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు,ఆర్ధిక శాఖ & పబ్లిక్ రిలేషన్స్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ఇండీవుడ్‌ వేదిక రూపకర్త సోహన్‌ రాయ్‌ తదితరులు ఈ వేడుకల్ని ప్రారంభించారు.

 

 

 

 

 

Back to Top