మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ

- September 25, 2016 , by Maagulf
మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ

మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఉరీ ఘటనలో 18 మంది వీర సైనికులను కోల్పోయాం. వీర మరణం పొందిన సైనికులకు వందనం చేస్తున్నా అంటూ ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఉరీ ఘటన కారకులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఉరీ ఘటనను దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ఉరీ ఘటన బాధిత కుటుంబాలకే కాదు.. దేశ ప్రజల మనసులను గాయపరించిందన్నారు.
రియో పారాలింపిక్స్‌ విజేతలకు ప్రధాని అభినందనలు తెలిపారు. పారాలింపిక్స్‌లో దీపా మాలిక్‌ విజయం మహిళల్లో ఎంతో స్ఫూర్తి నింపింది.

పారాలింపిక్స్‌లో జజారియా బంగారు పతకం సాధించి దేశం గర్వించేలా చేశాడని అభినందించారు. రానున్న పారాలింపిక్స్‌లోనూ క్రీడాకారులు రాణించాలని ఆశిస్తున్నట్లు ప్రధాని చెప్పారు. ''స్వచ్ఛభారత్‌ ప్రారంభించి రెండేళ్లు గడిచాయి. చిన్నారుల నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని స్వచ్ఛభారత్‌ను విజయవంతం చేశారు.

స్వచ్ఛ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1969ను ప్రారంభిస్తున్నాం. భారత్‌ను బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా తీర్చిదిద్దుతాం. గ్రామీణ భారతంలో ఇప్పటి వరకు 2.5 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం. రానున్న ఏడాది కాలంలో మరో 1.5 కోట్ల మరుగుదొడ్లు నిర్మిస్తాం.

అని ప్రధాని మోదీ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com